Whatsapp Loan: వాట్సప్ ద్వారా లోన్ పొందవచ్చు.. జస్ట్ హాయ్ అని మెసేజ్ పెడితే చాలు..

కోవిడ్ వల్ల డిజిటలైజేషన్ బాగా పెరిగిపోయింది. ఈ కామర్స్ రంగంతో పాటు బ్యాంకింగ్ రంగంలో కూడా టెక్నాలజీ వినియోగం బాగా పెరిగింది. ఏ పని కావాలన్నా ఆన్ లైన్ ద్వారా సులువుగా చేసుకోగలుగుతున్నారు.

  • Written By:
  • Updated On - May 5, 2023 / 11:00 PM IST

Whatsapp Loan: కోవిడ్ వల్ల డిజిటలైజేషన్ బాగా పెరిగిపోయింది. ఈ కామర్స్ రంగంతో పాటు బ్యాంకింగ్ రంగంలో కూడా టెక్నాలజీ వినియోగం బాగా పెరిగింది. ఏ పని కావాలన్నా ఆన్ లైన్ ద్వారా సులువుగా చేసుకోగలుగుతున్నారు. ముఖ్యంగా కోవిడ్ వల్ల బ్యాంక్ లావాదేవీలు ఎక్కువగా ఆన్ లైన్ ద్వారా సాగుతున్నాయి. బ్యాంకులన్నీ తమ కస్టమర్ల కోసం ఆన్ లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చాయి. ఆన్ లైన్ ద్వారా ఏ పనినైనా సులువగా చేసుకునే వెసులుబాటు కస్టమర్లకు లభించింది. నగదు ఎవరికైనా పంపాలన్నా లేదా నగదు రిసీవ్ చేసుకోవాలన్నా సరే ఈజీగా ఆన్ లైన్ లో చేసుకోవచ్చు.

ఇక లోన్లను కూడా ఆన్ లైన్ ద్వారా ఈజీగా బ్యాంకులు అందిస్తున్నాయి. ఆన్ లైన్ లోనే కావాల్సిన డాక్యుమెంట్స్ సమర్పిస్తే ఈజీగా లోన్ మంజూరు చేస్తారు. ఇటీవల ఇలాంటి యాప్ లు బాగా ఎక్కువయ్యాయి. ఇక అర్టిఫిషియర్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నడిచే వాట్సప్ బోట్ లను బ్యాంకులు అందుబాటులో తెచ్చాయి. వీటి ద్వారా వాట్సప్ లోనే బ్యాంకు సమాచారం, బ్యాలెన్స్, లోన్ల సమాచారాన్ని ఈజీగా పొందవచ్చు. తాజాగా ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ సంస్థ వాట్సప్ ద్వారా లోన్లు పొందే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.

వాట్సప్ ద్వారా వినియోగదారులకు రూ.10 లక్షల బిజినెస్ లోన్‌ను అందిస్తుంది. ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ నుంచి 24/7 ఎండ్ టు ఎండ్ డిజిటల్ లోన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇందుకోసం వాట్సప్ లో 9019702184 నెంబర్ కు హాయ్ అని మెసేజ్ చేయలి. దీంతో లోన్ కి సంబంధించిన వివరాలు వస్తాయి. లోన్ కు అప్లై చేసుకుని డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయాలి. ఆ సంస్థ ప్రతినిధులు డాక్యుమెంట్స్ వెరిఫై చేసిన తర్వాత లోన్ డబ్బులు అకౌంట్ లో పడతాయి. వాట్సప్ ద్వారా పేపర్ లెస్ విధానంలో లోన్ పొందవచ్చని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. వాట్సప్ ద్వారా తక్షణమే రుణం పొందవచ్చని, చిరు వ్యాపారవేత్తలపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలిపారు.