Site icon HashtagU Telugu

Yogasanas: నెల్లూరులో సామూహిక యోగాసనాలు

Yoga In 2026 Asian Games

అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరులో ఉన్న అక్షర విద్యాలయంలో కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వశాఖ, స్వర్ణభారత్ ట్రస్ట్, అక్షర విద్యాలయం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులంతా సామూహికంగా యోగాసనాలు వేశారు. ఇక కాకినాడలోని కేంద్రీయ విద్యాలయంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు యోగా సాధన చేశారు. యోగా చేయడం వల్ల ఎన్ని రకాలు ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ప్రతిరోజు చేయడం వల్ల గొప్ప ఉపశమనం లభిస్తుందన్నారు.