Site icon HashtagU Telugu

YCP : కృష్ణాజిల్లాలో వైసీపీ షాక్‌.. రాజీనామా చేసిన జెడ్పీటీసీ..!

YCP ZPTC

YCP ZPTC

కృష్ణాజిల్లాలో వైసీపీకి షాక్ త‌గిలింది. ఉయ్యురు వైసీపీ జెడ్పీటీసీ యలమంచిలి పూర్ణిమ తన పదవికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తన రాజీనామా పత్రాన్ని ఈరోజు మచిలీపట్నంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషకి అందించారు. ప్రజా ప్రతినిధి అయిన తనకు పార్టీ పెద్దలు సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని గత కొన్ని రోజులుగా జెడ్పీటీసీ పూర్ణిమ ఆవేద‌న‌లో ఉన్నారు. పార్టీ పెద్దల నియంత్రత్వ ధోరణి కారణంగానే పూర్ణిమ రాజీనామా చేశార‌ని ఆమె అనుచ‌రులు అంటున్నారు. అధికార పార్టీలో మహిళ ప్రజా ప్రతినిధులకు సరైన గౌరవం లేదంటూ ఆవేదన తో రాజీనామా చేస్తున్నట్లు అనుచరులు వెల్లడించారు.