Site icon HashtagU Telugu

YCP vs JanaSena: పవన్ స్పీచ్ పై వైసీపీ ఎటాక్

Perni Nani Pawan Kalyan Imresizer

Perni Nani Pawan Kalyan Imresizer

జనసేన ఆవిర్భావ సభలో పవన్ ఇచ్చిన స్పీచ్ పై వైసీపీ ఎటాక్ మొదలుపెట్టింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పల్లకి మోయడానికి జనసైనికుల్ని, వీర మహిళల్ని పవన్ సిద్దం చేస్తున్నాడని మంత్రి పేర్ని నాని ఆరోపణలకు దిగాడు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చంద్రబాబుకు అండగా ఉండాలి అని జనసేనాని నిర్ణయం అయిపోయిందని పేర్కొన్నాడు. ప్యాకేజి ముట్టిన తరువాత ఆవిర్భావ సభ జరిగిందని వైసీపీ భావిస్తోంది. రెండేళ్ల ముందుగానే పవన్ ప్రకటించిన మేనిఫెస్టో వెనుక చాలా వ్యూహం ఉందని అంచనా వేస్తోంది.

ఈ మేనిఫెస్టోకు చంద్ర బాబు అంగీకరించాడు కాబట్టి పొత్తుకు వెళ్తున్నామని రాబోవు రోజుల్లో చెప్పడానికి ఈ ప్లాన్ అంటూ ఆరోపిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వంలో ఉండగా ఒకలా జగన్ సర్కార్ సమయంలో ఇంకోలా పవన్ వ్యవహారం ఉంటుందని వైసీపీ విమర్శలకు దిగింది.
2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు అవినీతి, లోకేష్ దందాలు గురించి పవన్ ఆరోపణలు చేసాడు. ఇప్పుడు మళ్లీ టీడీపీ తో పొత్తుకు రెడి కావటం పాకేజీ లో భాగం అంటూ మంత్రి నాని దుయ్యబట్టాడు. ఎనిమిదేళ్ల ప్రస్థానంలో జనసేన సాదిందించింది ఏమి లేదని ఎద్దవా చేసాడు. చంద్రబాబుకు అద్దె పార్టీ లాగా జనసేన పార్టీ ని మార్చడని విమర్శించాడు. ఒక సిద్ధాంతం అంటూ లేకుండా ఏపీ ప్రజలను మోసం చేస్తున్నాడని , ముసుగు తీసి నిజాయితీగా రాజకీయాలు చేయాలని హితవు పలికాడు.
మొత్తం మీద ఆవిర్భావ సభ పొత్తు కోసం పెట్టుకున్నది గా వైసీపీ ఫోకస్ చేస్తోంది. చంద్రబాబు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ పవన్ చదివాడని భావిస్తోంది. పవన్ స్పీచ్ మీద ఎటాక్ చేస్తోంది. ఈ పరిణామం ఎంత వరకు వెళుతుందో చూద్దాం.