ఏపీ అధికార పార్టీ వైసీపీ (YCP)..బస్సు యాత్ర (Bus Yatra)కు సిద్దమవుతుంది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలకు మరింత చేరువ్వాలనే ఉద్దేశ్యంతో బస్సు యాత్ర చేపట్టాలని అధిష్టానం సిద్ధమైంది. గత ఎన్నికల సమయంలో పాదయాత్ర చేసి..అధికారంలోకి వచ్చిన జగన్.. అధికారం చేపట్టిన తర్వాత అనేక సంక్షేమ పధకాలు చేపట్టారు. ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టి..నేతలను ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను ఆరా తీయించిన జగన్..ఇప్పుడు బస్సు యాత్రతో మరింత చేరువ అవ్వాల్సిని చూస్తున్నాడు.
ఈ యాత్ర ద్వారా సుమారు వంద రోజులు పాటు (Bus Yatra 100 days) ప్రజల్లో ఉండేలా ఈ ప్రత్యేక కార్యక్రమన్ని పార్టీ హైకమాండ్ సిద్ధం చేసింది. ప్రస్తుతం పార్టీ పునర్ వ్యవస్థీకరణపై దృష్టికేంద్రీకరించారు. – జిల్లా పార్టీ అధ్యక్షులు, నూతన కార్యవర్గాలను ఎంపికచేశారు. ఈనెలాఖరులోగా మండల కమిటీలను నియమించడం పూర్తి చేయనున్నారు. ఈ కమిటీలు పూర్తి కాగానే ప్రతి జిల్లాలోనూ ఆయా జిల్లా అధ్యక్షుడి నేతృత్వంలో జిల్లా కార్యవర్గ సభ్యులతో బస్ యాత్రను నిర్వహించాలని నిర్ణయించారు. కొత్తగా ఎంపిక చేసిన మండల కన్వీనర్లు, కార్యవర్గం వారివారి మండల పరిధిలో ఏఏ గ్రామాల మీదుగా బస్సు యాత్ర సాగాలన్న దానిపై రోడ్ మ్యాప్ జిల్లా పార్టీకి ఇవ్వనుంది. ఈ సారి బస్ యాత్రలో భాగంగా జిల్లా పార్టీ వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించనున్నారు. బస్సు యాత్రతో పాటు ఐప్యాక్ టీం కూడా ఆయా మండలాల్లోని పరిస్థితులను విశ్లేషించి రాష్ట్ర పార్టీకి ఒక నివేదిక అందజేయనుంది.
Read Also : Telangana BJP : నిజంగానే వీరంతా బిజెపిని వీడితే పరిస్థితి ఏంటి..?
ఇప్పటికే వై ఏపీ నీడ్స్ జగన్ (Why AP Needs YS Jagan) పేరుతో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు బస్ యాత్ర జరగనుంది. ఈ రెండు కార్యక్రమాలు పూర్తయ్యేలోగా మరో కార్యక్రమాన్ని తెరమీదకు తీసుకొచ్చేలా ఐప్యాక్ కార్యాచరణ రూపొందిస్తోంది. మొత్తం మీద ఎన్నికల సమరానికి ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమవుతుండడంతో..వైసీపీ సైతం తగ్గేదెలా అన్నట్లు పలు కార్యక్రమాలతో జనాల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంది. మరి ప్రజల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.