ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam)లో ED అధికారులు దూకుడు పెంచారు. ఈ కుంభకోణంలో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో అరెస్ట్ నమోదైంది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మాగుంట రాఘవను ఈడి అధికారులు అరెస్ట్ చేశారు. మధ్యాహ్నం కోర్టులో హాజరుపరచనున్నారు. కాగా ఇటీవల 110 కవిత మాజీ సీఏ బుచ్చిబాబు, గౌతమ్ మల్హోత్ర సహా పలువురిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే సుమారు 9 మంది ఈ కేసులో అరెస్ట్ కాగా.. తాజాగా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు మాగుంట రాఘవను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అదుపులోకి తీసుకుంది. ఢిల్లీలో అతనిని అరెస్ట్ చేసిన ఈడీ ఈరోజు మధ్యాహ్నం కోర్టులో హాజరుపర్చనుంది.
Also Read: Flight Violence: విమానాల్లో హింస.. 2022లో ‘నో ఫ్లై లిస్ట్’ లో 63 మంది.. ఇండిగోలో గరిష్ఠంగా..!
గతంలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో ఇంతకుముందు సీబీఐ, ఈడీ అధికారులు సోదాలు చేశారు. నెల్లూరు, చెన్నైలలో జరిపిన తనిఖీల్లో అనేక కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే అప్పట్లో ఈ వార్తలను మాగుంట శ్రీనివాసరెడ్డి ఖండించారు. కానీ ఈరోజు మాగుంట కుమారుడు అరెస్ట్ కావడంతో సంచలనంగా మారింది.