Site icon HashtagU Telugu

YCP MLA Mekapati: వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు

Mekapati

Mekapati

నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు వచ్చింది. ఆయనను నెల్లూరు నగరంలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స కొనసాగుతోంది. గుండె పోటుతో నెల్లూరు అపోలో ఆస్పత్రిలో చేరిన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. తన అభిమానులకోసం ఓ వీడియో విడుదల చేశారు. గుండెపోటు రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారని, తనకు మెరుగైన వైద్యం అందించారని, తాను బాగానే ఉన్నానని, అయితే డాక్టర్ల సలహా మేరకు చెన్నై వెళ్తున్నట్టు చెప్పారు.

గుండె పోటుతో నెల్లూరు అపోలో ఆస్పత్రిలో చేరిన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని చెన్నై అపోలోకి తరలించారు. ఆయన గుండెలో రెండు వాల్వ్స్ బ్లాక్ అయినట్టు వైద్యులు గుర్తించారు. గుండెపోటు రావడంతో ఆయన్ను వెంటనే నెల్లూరు అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలించారు.