హీరో నానిపై వైసీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. హీరో నాని సినిమాలకు తీసుకుంటోన్న పారితోషికం ఎంత? అంటూ నిలదీస్తున్నారు. వైసీపీ నేత అంబటి రాంబాబు కూడా ఈ విషయంపై స్పందిస్తూ నానిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘పారితోషకాన్ని వెల్లడించకుండా సినిమా టికెట్ ధర గురించి మాట్లాడే నైతిక అర్హత ఏ హీరోకీ లేదు!’ అంటూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.
పారితోషకాన్ని వెల్లడించకుండా
సినిమా టికెట్ ధర గురించి
మాట్లాడే నైతిక అర్హత
ఏ "హీరో"కి లేదు!— Ambati Rambabu (@AmbatiRambabu) December 24, 2021
‘శ్యామ్ సింగరాయ్’ ప్రచారంలో భాగంగా నాని మాట్లాడుతూ .. ఏపీ ప్రభుత్వం టికెట్ ధర తగ్గించి ప్రేక్షకులను అవమానించిందని, సినిమా హాళ్ల కంటే కిరాణా దుకాణాల కలెక్షన్ ఎక్కువగా ఉంటుందని ఆయన ఎద్దేవా చేసిన నేపథ్యం వైసీపీ నాయకులు స్పందించారు. మరోవైపు, నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా ఈ రోజే విడుదలైంది.