జనసేన అధినేత (Pawan Kalyan ) రాబోయే ఎన్నికల్లో టీడీపీ తో కలిసి పోటీ చేయబోతున్నామని ప్రకటించారో లేదో..వైసీపీ నేతలు (YCP Leaders) వరుసపెట్టి మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడం స్టార్ట్ చేసారు. తమ నేతలు ఇలా వస్తారని ముందే రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు (MP Raghu Rama Krishnam Raju ) చెప్పారు. ఆయన చెప్పినట్లు నేతలంతా క్యూ కట్టారు. ఎవరి స్క్రిప్ట్ వారిది అన్నట్లు మీడియా ముందుకు వచ్చి వారి వారి స్టయిల్ లో పవన్ కళ్యాణ్ ఫై చంద్రబాబు ఫై తిట్ల దండకం చేసారు. మరి ఎవరెవరు ఏ విధంగా స్పందించారో చూద్దాం.
‘‘నువ్వు రాజమండ్రి సెంట్రల్ జైల్‌కి వెళ్ళింది టీడీపీతో పొత్తును ఖాయం చేసుకునేందుకని ప్రజలకు పూర్తిగా అర్థం అయింది పవన్ కల్యాణ్. ఇన్నాళ్ళూ నీ మీద నమ్మకం పెట్టుకున్న అభిమానులకు, కాస్తో కూస్తో నిన్ను నమ్మిన వాళ్ళకు ఈరోజుతో భ్రమలు తొలగించేశావు. ఇక ఇది పొత్తులకి, ప్రజలకి మధ్య జరుగుతున్న యుద్ధం. ఇక మిమ్మల్ని మూకుమ్మడిగా ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టడానికి ప్రజలంతా సిద్ధం’’ అని వైసీపీ ట్విట్టర్ లో పేర్కొంది.
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో విచారణను ఎదుర్కొంటోన్న చంద్రబాబును పవన్ కల్యాణ్ ఓదార్చడానికి వెళ్లాడా? లేక ప్యాకేజీ డీల్ కోసం వెళ్లాడా? అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. చంద్రబాబును ఓదార్చాలనే సెంటిమెంట్ కోసం కాకుండా ప్యాకేజీ సెటిల్‌మెంట్ కోసం పవన్ కల్యాణ్ జైలుకు వెళ్లి చంద్రబాబు పలకరించాడని ఆరోపించారు. ఇన్నాళ్లు వేసుకున్న ముసుగును పవన్ ఇప్పుడు తొలగించాడంతేనని పేర్కొన్నారు. పొత్తుల విషయంలో పవన్‌కు ఓ క్లారిటీ ఉందని, అది లేనిది బీజేపీకేనని ఎద్దేవా చేశారు.
దేశంలోనే.. పార్టీ పెట్టి పక్కవాడి కోసం తాను పనిచేయడమే కాకుండా తన కార్యకర్తలను కూడా జెండా కూలీలుగా ఇతర పార్టీల జెండాను మోయించే ఏకైక నాయకుడు పవన్ కల్యాణ్ అని మంత్రి రోజా ఎద్దేవా చేసారు. జైల్లో ఉన్న ఖైదీతో, ప్రజల డబ్బు దోచుకున్న దొంగ దగ్గర ప్యాకేజీ తీసుకుని పొత్తు పెట్టుకున్న ఒకే ఒక పార్టీ జనసేన పార్టీ అని రోజా అన్నారు. నిజంగా పవన్ కల్యాణ్ కు ప్రజల మీద ప్రేమ ఉంటే.. ప్రజల కోసం ఏరోజైనా పోరాటం చేశాడా? కానీ, ఈరోజు చంద్రబాబు కోసం పోరాటం చేస్తానని అంటున్నాడు. రాజమండ్రి పుష్కరాల్లో 29 మందిని పబ్లిసిటీ పిచ్చికోసం చంద్రబాబు చంపేసినప్పుడు ఎందుకు పోరాటం చేయలేదు? మీ అన్న చిరంజీవి గారు సంఘీభావం తెలపడానికి వస్తే, అరెస్ట్ చేస్తే ఎందుకు నోరు తెరవలేదు? ఎందుకు పోరాటం చేయలేదు? కాపుల మీద అక్రమ కేసులు పెట్టి, లాఠీ ఛార్జ్ చేస్తే ఎందుకు రాలేదు? ఎందుకు పోరాటం చేయలేదు? పవన్ కల్యాణ్ అంటూ రోజా ప్రశ్నించారు.
Read Also : Chandrababu Case: తెలంగాణాలో ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు ఉండవ్
పవన్ – చంద్రబాబుది ఇన్నాళ్లూ ప్యాకేజీ బంధం – ఇప్పుడు పొత్తు బంధమా..? అని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రశ్నించారు. ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందంటూ పవన్ కళ్యాణ్ అనడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. 2009లో చంద్రబాబు కోసం కలిసి పోటీ చేశారు. 2014లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చటానికి విడిగా పోటీ చేశారు. ఇప్పుడు కలిశామంటున్నారు గానీ అసలు విడిపోయిందెప్పుడు? అంటూ సజ్జల ప్రశ్నించారు.
పవన్ ప్రకటనతో ప్యాకేజీ స్టార్ అని చెప్తున్న విషయం నిజమైందని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. పవన్ కల్యాణ్‌ను ప్రజల్లో, సమాజంలో.. డబ్బు కోసం ప్యాకేజీ కోసం పనిచేసే వ్యక్తిగా ప్రచారం చేసింది చంద్రబాబు కాదా..? అని ప్రశ్నించారు. ఇక రావాల్సిన వారు చాలామందే ఉన్నారు ..గుడివాడ అమర్ నాధ్, కొడాలి నాని మొదలగు వారు లైన్లో ఉన్నట్లు తెలుస్తుంది.