Chandrababu Arrest – YCP Happy : చంద్రబాబు అరెస్ట్ ..సంబరాల్లో వైసీపీ

స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ స్కాం (Skill Development Scam )లో మాజీ సీఎం, టీడీపీ చంద్రబాబు ను CID అధికారులు అరెస్ట్ చేయడం తో వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. చేసిన పాపలకు శిక్ష తప్పదని, ప్రజల సొమ్మును కాజేసిన చంద్రబాబు బాగుపడడని, దేవుడు అంటూ ఒకడు ఉన్నాడని ఎవర్ని వదిలిపెట్టాడని వైసీపీ నేతలంతా పెద్ద పెద్ద మాటలు అంటున్నారు. పకడ్బందీగా ప్లాన్‌ చేసిన స్కామ్‌ కేసులోనే చంద్రబాబు (Chandrababu Arrest)ను సీఐడీ పోలీసులు అరెస్ట్ […]

Published By: HashtagU Telugu Desk
YCP Leaders Reaction on Chandrababu Arrest

YCP Leaders Reaction on Chandrababu Arrest

స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ స్కాం (Skill Development Scam )లో మాజీ సీఎం, టీడీపీ చంద్రబాబు ను CID అధికారులు అరెస్ట్ చేయడం తో వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. చేసిన పాపలకు శిక్ష తప్పదని, ప్రజల సొమ్మును కాజేసిన చంద్రబాబు బాగుపడడని, దేవుడు అంటూ ఒకడు ఉన్నాడని ఎవర్ని వదిలిపెట్టాడని వైసీపీ నేతలంతా పెద్ద పెద్ద మాటలు అంటున్నారు.

పకడ్బందీగా ప్లాన్‌ చేసిన స్కామ్‌ కేసులోనే చంద్రబాబు (Chandrababu Arrest)ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశార‌ని వైసీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి చెప్పుకొచ్చాడు. ఆరోపణలున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం సాధారణం. అయినా.. రెండేళ్లుగా సాగుతున్న దర్యాప్తు కేసులో ఇప్పుడు కూడా చంద్రబాబును ప్రశ్నించకపోతే ఎలా?. స్కామ్‌లో దర్యాప్తే జరుగుతోంది.. రాజకీయాలు కాదు. రాజకీయ దురుద్దేశమే ఉంటే అరెస్ట్‌కు ఇన్ని రోజులు ఎందుకు సమయం పడుతుంది?. డబ్బు ఎటు నుంచి ఎటు వెళ్లిందనేది తేలడానికి టైం పట్టింది. బెనిఫీషియరీ కూడా చంద్రబాబే అని తేలడంతో అరెస్ట్‌ చేశారు. ఆయన్నేదో కరుణానిధిని అరెస్ట్‌ చేసినట్లు అర్ధరాత్రి ఏమీ అరెస్ట్‌ చేయలేదు. పకడ్బందీగా ప్లాన్‌ చేసిన స్కామ్‌ కేసులోనే చంద్రబాబు అరెస్ట్‌ అయ్యార‌ని సజ్జల అన్నారు.

మరో వైసీపీ నేత మంత్రి కారుమూరి నాగేశ్వరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలాప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోయారని ఆరోపించారు. సెక్రటరీ వాళ్లు చెప్పినా వినకుండా స్వయంగా చంద్రబాబు నాయుడే ఈ స్కామ్‌కు సూత్రధారి అయ్యారని ఆరోపించారు. షెల్ కంపెనీల ద్వారా ఆ సొమ్మును మొత్తం స్వాహా చేశారని అన్నారు. సీమెన్ కంపెనీకి అసలు సంబంధమే లేదని.. చంద్రబాబు నాయుడే డబ్బులు దోచుకున్నారని అన్నారు.

అనుభవం ఉంటే త‌ప్పు చేసినా అరెస్టు చేయకూడదా అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. రాజకీయ అనుభవం ఉంటే, స్కాములు చేస్తే అరెస్టు చేయరా..? అంటూ ఆయన ఫైర్ అయ్యారు. సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయిన చంద్రబాబును కొంతమంది నేతలు సమర్థిస్తూ.. అరెస్టును వక్రీకరిస్తూ ప్రజల నుంచి సింపథీ పొందేందుకు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడే ఉద్దేశపూర్వకంగా స్కిల్‌ స్కామ్‌లో ఇరుక్కున్నాడని, స్కామ్‌కు సంబంధించిన వివరాలన్నీ సీఐడీ వెలికి తీసిందని చెప్పారు. విచారణ కొనసాగితే దీంట్లో ఉన్నవారందరూ బయటకు వస్తారన్నారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు డైవర్షన్, ఫైబర్‌ నెట్‌ అవకతవకల్లో లోకేష్‌ పాత్ర ఉందని, విచారణ తొందరలోనే పూర్తి చేస్తామని సీఐడీ అధికారులు చెప్పారన్నారు.

Read Also : Skill Development Scam : చంద్రబాబుకు పదేళ్ల జైళ్ల శిక్ష పడొచ్చు..? – ఏపీ CID చీఫ్ సంజయ్

కక్ష సాధింపు ఉద్దేశం ఉంటే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ను అరెస్ట్ చేసేవాళ్లమని మంత్రి గుడివాడ అమర్నాద్ అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో పక్కా సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నందునే చంద్రబాబు నాయుడిని సీఐడీ పోలీసులు అరెస్టు చేసారని , చంద్రబాబుపై ప్రేమతో ఆయన అవినీతికి సంబంధించిన ఆధారాలను పవన్ కల్యాణ్ చూడలేకపోతున్నారని అన్నారు. ఓటుకు నోటు కేసు, అమరావతి రియల్ ఎస్టేట్ స్కామ్.. ఇలా చంద్రబాబు నాయుడు చేసిన స్కాంలు చాలా ఉన్నాయన్నారు. కేంద్ర పరిధిలోని ఈడీ సంస్థ నోటీసు ఇచ్చిన కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్టు చేస్తే పురందేశ్వరికి ఉలుకెందుకని ప్రశ్నించారు. చంద్రబాబు స్కిల్డ్ క్రిమినల్, అన్ స్కిల్డ్ పొలిటీషియన్ అంటూ మంత్రి అమర్ ధ్వజమెత్తారు.

ఇలా వరుస పెట్టి వైసీపీ నేతలు చంద్రబాబు అరెస్ట్ గురించి మాట్లాడుతూ..లోలోపల సంబరాలు చేసుకుంటున్నారు. సరే ఇది ఒకే..మరి మీ అధినేత జగన్ , మీ ఎంపీ అవినాష్ సంగతి ఏంటి..నెక్స్ట్ వాళ్లు కూడా జైలు ఊసలు లెక్కపెట్టాల్సిందేనా..? అని టీడీపీ శ్రేణులు అంటున్నారు. బాబాయ్ వైఎస్ వివేకాను హత్య చేసిన ఎంపీ అవినాష్ రెడ్డి (Mp Avinash Reddy)ని ఎందుకు అరెస్ట్ చేయరని టీడీపీ నేతలు, శ్రేణులు ప్రశ్నిస్తున్నారు.

అందరికి ఒకే న్యాయం ఉండాలి కదా.. గొడ్డలిపోటును గుండెపోటుగా మర్చి..హాయిగా రోడ్ల ఫై తిరుగుతున్న మీ ఎంపీ సంగతి ఏంటి..? అది చేయాలనీ చెప్పిన మీ అధినేత జగన్ సంగతి ఏంటి అని వారంతా ప్రశ్నిస్తున్నారు. చిత్తశుద్ది ఉంటే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలనీ… అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే దమ్ముందా..? అని టీడీపీ నేతలు సవాల్ విసురుతున్నారు. వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తోన్న సీబీఐపై బెదిరించారని వారంతా వాపోతున్నారు. అన్ని రోజులు మీవే కాదని మాకు రోజులు వస్తాయని..అప్పుడు ఎవర్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారు.

  Last Updated: 09 Sep 2023, 12:48 PM IST