YSRCP : రాజధానిపై వైసీపీ యూటర్న్..?

YSRCP : ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరిలో కొత్త ట్విస్ట్ కనిపిస్తోంది. ఇటీవల పార్టీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు ఈ దిశగా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.

Published By: HashtagU Telugu Desk
Ysrcp

Ysrcp

YSRCP : ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరిలో కొత్త ట్విస్ట్ కనిపిస్తోంది. ఇటీవల పార్టీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు ఈ దిశగా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. “మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతినే రాజధానిగా కొనసాగిస్తాం. అంతేకాకుండా చంద్రబాబు కన్నా ఎక్కువగా అభివృద్ధి చేస్తాం” అంటూ ఆయన వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు అధికార పార్టీలో కీలక నేతల దృష్టిని ఆకర్షించాయి. ఇక ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. 2014 ఎన్నికల తర్వాత జగన్ అమరావతిని స్వాగతించిన సంగతి తెలిసిందే. అయితే, 2019లో అధికారంలోకి వచ్చిన అనంతరం మూడు రాజధానుల సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి, అమరావతితోపాటు విశాఖపట్నం, కర్నూల్‌లను కూడా పరిపాలనా కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.

 Mrigasira Karthi : మృగశిరకార్తె రోజు చేపలు ఎందుకు తింటారో తెలుసా..?

దీనిపై పెద్ద ఎత్తున చర్చలు, ఉద్యమాలు జరిగాయి. ఇప్పుడు మళ్లీ వైసీపీ నుంచి అమరావతికి మద్దతు లాంటి స్వరాలు వినిపించడాన్ని పరిగణనలోకి తీసుకుంటే—ఇది పార్టీ అధికారిక మార్గదర్శకమేనా, లేక జోగి రమేష్‌ వ్యక్తిగత అభిప్రాయమా? అన్నదానిపై స్పష్టత లేదు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ అధికారికంగా స్పందించాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వాస్తవానికి రాజధాని వివాదం గతంలోనే రాష్ట్రంలో తీవ్ర రాజకీయ స్థబ్దతకు దారితీసింది. ఇక తాజా వ్యాఖ్యలు కొత్త దిశగా రాజకీయ పరిణామాలను మలుపుతిప్పే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

 D4 Anti-Drone System: డీ4 యాంటీ-డ్రోన్ సిస్టమ్‌.. భార‌త్ నుంచి కొనుగోలుకు సిద్ధ‌మైన తైవాన్!

  Last Updated: 08 Jun 2025, 11:41 AM IST