Site icon HashtagU Telugu

MLC: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రుహుల్లా నామినేషన్‌

Ycp

Ycp

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎండీ రుహుల్లా గురువారం నాడు ఏపీ శాసనసభ ఉప కార్యదర్శి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మహ్మద్ కరీమున్నిసా హఠాన్మరణంతో ఖాళీ అయిన స్థానానికి శాసన సభ్యుల కోటాలో ప్రస్తుతం ఎన్నిక జరుగుతున్నది. క‌రీమున్నిసా కుమారుడు ఎండీ ర‌హుల్లా కే సీఎం జ‌గ‌న్ ఎమ్మెల్సీ టికెట్ కేటాయించారు.

దీంతో ఎండీ రుహుల్లా అల్లా సాక్షిగా ప్రమాణం చేసి ఈ రోజు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి పి.వి. సుబ్బారెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహరాలు) సజ్జల రామకృష్ణా రెడ్డి, ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పి. గౌతంరెడ్డి పాల్గొన్నారు.

Exit mobile version