Site icon HashtagU Telugu

Yarlagadda Venkatrao : టీడీపీ లో చేరిన యార్లగడ్డ ..

Yarlagadda Venkatrao Joins TDP

Yarlagadda Venkatrao Joins TDP

వైసీపీ మాజీ నేత యార్లగడ్డ వెంకట్రావు (Yarlagadda Venkatrao) సోమవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Naara Lokesh) సమక్షంలో టీడీపీ లో (Yarlagadda Venkatrao Joins TDP) చేరారు. గన్నవరం నియోజకవర్గం (Gannavaram Constituency)లో వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతానని ప్రకటించిన యార్లగడ్డ.. నిన్న ఆదివారం హైదరాబాద్ లో చంద్రబాబును కలిసి ఆ మేరకు అభ్యర్ధించినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే గన్నవరంలో ఇన్ ఛార్జ్ లేని టీడీపీ యార్లగడ్డను పార్టీలోకి తీసుకునేందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో యార్లగడ్డ వెంకట్రావు ఈరోజు కృష్ణాజిల్లాలో యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. యార్లగడ్డ వెంకట్రావును పసుపు కండువా కప్పి పార్టీలోకి లోకేష్ ఆహ్వానించారు.

2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు.. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై 838 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత వంశీ వైసీపీకి మద్దతు తెలపడంతో పార్టీలో యార్లగడ్డ ప్రాధాన్యత తగ్గతూ వచ్చింది. అనంతరం ఆయనకు డీసీసీబీ ఛైర్మన్ పదవి ఇచ్చినా.. కొన్నాళ్లకే తొలగించారు. వంశీతో సఖ్యతగా ఉండమని సీఎం జగన్ యార్లగడ్డకు సూచించినా అది పనిచేయలేదు. చివరకు పార్టీలో ఇమడలేక ఇటీవలే రాజీనామా చేశారు. త్వరలో యార్లగడ్డను టీడీపీ అధికారికంగా గన్నవరం అసెంబ్లీ అభ్యర్ధిగా (Gannavaram Constituency TDP Candidate) ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో వల్లభనేని వంశీపై టీడీపీ అభ్యర్ధిగా యార్లగడ్డ పోటీ చేయడం ఖాయమైంది.

Read Also : BRS list strategy : KCR వ్యూహాల‌కు అర్థాలు వేరు.!