Site icon HashtagU Telugu

Yamuna River: మరోసారి ఉగ్రరూపం దాల్చిన యమునా నది.. అప్రమత్తమైన ఢిల్లీ?

Yamuna River

Yamuna River

భారతదేశంలోని ఉత్తరాదిన వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో వరదలు భారీగా సంభవిస్తున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో గ్రామాలు నీట మునగగా, చాలామంది మనుషులు కూడా చనిపోయారు. ఆస్తి నష్టంతో పాటు ప్రాణం నష్టం కూడా సంభవిస్తోంది. ఇప్పటికే గంగా యమునా నదులు ఉగ్రరూపం దాల్చాయి. ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో యమునా నది ఉగ్రరూపం దాల్చి ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఢిల్లీని వరదలు ముంచెత్తాయి.

వరదలు తగ్గుముఖం పడుతున్నాయి అని ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్న నేపథ్యంలో మరొకసారి యమునా నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. దాంతో ఢిల్లీ అప్రమత్తమయ్యింది.

 

ఉత్తరాఖండ్ లోని హిమాచల్ ప్రదేశ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో హర్యానాలోని హత్నికుండ్ బరాజ్ నుంచి ప్రభుత్వం రెండు లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసింది. దీంతో దిగువన ఉన్న ఢిల్లీకి వరద నీరు పోటెత్తింది.

 

దాంతో యమునా నది మరోసారి ఉగ్రరూపం దాల్చింది. దీంతో ప్రజలు మరోసారి భయ భ్రాంతులకు లోనవుతున్నారు. ఈ క్రమంలోనే యమునా నది రికార్డు స్థాయిలో ఢిల్లీలోని పాత రైల్వే బ్రిడ్జి వద్ద ప్రవాహం 205.75 మీటర్లకు చేరింది. దీంతో ఢిల్లీ రాష్ట్రం అప్రమత్తమయింది.

 

దీంతో అధికారులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యమునా నది పరిసర ప్రాంతాలలో ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించింది. యమునా నది ఉధృతం పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు