XChat: వాట్సాప్ ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన మెసేజింగ్ అప్లికేషన్. అయితే, ఇప్పుడు వాట్సాప్‌కు ప్రత్యర్థిగా ఒక కొత్త మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ విడుదలైంది. పేరు ఎక్స్ చాట్.. ఇది ఒక సురక్షితమైన, ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ సేవ, మరియు టెస్లా CEO ఎలోన్ మస్క్ దీన్ని ప్రారంభించారు. వినియోగదారులకు ఎక్కువ సౌకర్యాలు ఇవ్వడం లక్ష్యంగా, XChat మొబైల్ నంబర్ లింక్ చేయాల్సిన అవసరం లేకుండా పనిచేస్తుంది.
ఎలోన్ మస్క్ X సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ద్వారా XChat ప్రారంభోత్సవాన్ని ప్రకటించారు. ఈ అప్లికేషన్ బిట్‌కాయిన్ స్థాయి ఎన్‌క్రిప్షన్ సాంకేతికతను ఉపయోగిస్తోంది. ఎలోన్ మస్క్ ఆశయం XChatని ఆల్-ఇన్-వన్ యాప్‌గా రూపాంతరం చేయడం. చైనాలో విస్తృతంగా వినియోగిస్తున్న WeChat లాంటి అప్లికేషన్‌లతో పోటీ పడేందుకు ఇది వలే మార్గం.
ఇండియాలో లాంచ్ అయిన Range Rover SV Masara Edition – ధర ₹4.99 కోట్లు, కేవలం 12 యూనిట్లు మాత్రమే
XChat ఉపయోగించాలంటే మొబైల్ నంబర్ లింక్ చేయాల్సిన అవసరం లేకపోవడం ప్రత్యేకత. ఇలాంటి పరిస్థితుల్లో, యూజర్లు మెసేజ్‌లు, ఆడియో, వీడియో కాల్స్, ఫైల్ షేరింగ్ వంటి ఫీచర్లు వినియోగించవచ్చు. ప్రస్తుతం XChat పరీక్ష దశలో ఉంది, త్వరలోనే విస్తృతంగా అందుబాటులోకి వస్తుంది.
XChat ముఖ్య ఫీచర్లు:
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్: వినియోగదారుల గోప్యతను పరిరక్షించేందుకు బిట్‌కాయిన్ స్థాయి ఎన్‌క్రిప్షన్ కలిగి ఉంది. హ్యాకర్లు సందేశాలను అర్థం చేసుకోలేరు.
డిసప్పియరింగ్ మెసేజ్‌లు: యూజర్లు కోరుకున్నప్పుడు మెసేజ్‌లు ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతాయి, ఇది గోప్యతకు అదనపు భద్రత.
ఆడియో, వీడియో కాల్స్: ఎలాంటి నంబర్ లింక్ లేకుండా ఆడియో, వీడియో కాల్స్ చేయవచ్చు.
XChatలో వాట్సాప్‌లో ఉన్న అనేక ఫీచర్లు ఉన్నాయి.. ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్‌లు, అదృశ్యమయ్యే సందేశాలు, వీడియో/ఆడియో కాల్స్. కానీ ప్రధాన తేడా ఏమిటంటే, XChatకి మొబైల్ నంబర్ అవసరం లేదు, వాట్సాప్‌లో మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. ఇది కొత్త యూజర్లకు మెసేజింగ్ ప్రపంచంలో కొత్త అనుభవాన్ని అందించే ఆశతో రూపొందింది. త్వరలో ఈ అప్లికేషన్ అందరికీ అందుబాటులోకి రానుంది.