X Sign Removed : ట్విట్టర్ లోగో నుంచి బ్లూ కలర్ పిట్ట ఎగిరిపోయి.. దాని ప్లేస్ లోకి “X” గుర్తు వచ్చి చేరిన సంగతి తెలిసిందే. ఈ మార్పు జరిగిన వెంటనే (మూడు రోజుల క్రితమే) అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ట్విట్టర్ ప్రధాన కార్యాలయం ముందు లోగో డిస్ ప్లే బోర్డును, కార్యాలయ భవనంపై ఉన్న లోగో సింబల్ ను మార్చేశారు. అయితే కార్యాలయ భవనంపై ఉన్న “X” లోగోను తాజాగా స్థానిక పోలీసులు వచ్చి తీయించారు. ఆ ఏరియాలో నివసించే వారి నుంచి కంప్లైంట్స్ వెల్లువెత్తడంతో ఈ చర్య తీసుకున్నారు.
Also read : LPG Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. రూ. 100 తగ్గిన సిలిండర్ ధర..!
ట్విట్టర్ హెడ్ ఆఫీస్ బిల్డింగ్ పై అమర్చిన “X” లోగో డిస్ ప్లే లోపల కాంతివంతమైన లైట్లను అమర్చారు. ఆ ప్రకాశవంతమైన కాంతి నేరుగా తమ ఇళ్లలోకి ప్రసరిస్తోందని ఫలితంగా రాత్రివేళ నిద్రకు భంగం కలుగుతోందని 24 మంది స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉరుములు ఉరిమినప్పుడు వెలువడేంత లైటింగ్.. “X” లోగోలోని లైట్ల నుంచి వస్తోందని ఆరోపించారు. దీంతో ప్రజల సౌకర్యార్ధం ట్విట్టర్ హెడ్ ఆఫీస్ పై ఉన్న “X” లోగోను (X Sign Removed) బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు తొలగించారు. “X” లోగో సైజును తగ్గించుకొని, అందులోని లైట్ల తీవ్రతలో మార్పులు చేసుకొని.. బిల్డింగ్ పై మళ్ళీ “X” సింబల్ ను డిస్ ప్లే చేసుకోవచ్చని వారు సూచించారు. దీనికి సంబంధించి స్థానిక సంస్థల నుంచి పర్మిషన్ తీసుకొని, కొన్ని ఫీజులను కట్టాల్సి ఉంటుందన్నారు. అనుమతి లేకుండా “X” లోగోను బిల్డింగ్ పై ఇన్‌స్టాలేషన్ చేసినందుకు బిల్డింగ్ యజమాని ఫైన్ చెల్లించాలని బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు చెప్పారు.
Also read : Ukraine War: ఉక్రెయిన్ దాడికి రష్యా ప్రతి దాడి.. పదేళ్ల బాలికతో సహా ఆరుగురు మృతి, 75 మందికి గాయాలు..!