Predictions: మూడో ప్రపంచం యుద్ధం వస్తుందట.. ఆమె చెప్పిన భవిష్యవాణి నిజం అవుతుందా?

మన దేశంలో ఎంతోమంది పండితులు, జ్యోతిష్య పండితులు ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే జ్యోతిష్య

  • Written By:
  • Publish Date - August 12, 2022 / 11:15 AM IST

మన దేశంలో ఎంతోమంది పండితులు, జ్యోతిష్య పండితులు ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే జ్యోతిష్య పండితులు ఎప్పటికప్పుడు పరిస్థితులను ముందుగానే పసిగట్టి ప్రజలను క్షేమంగా ఉండమని చెబుతూ ఉంటారు. అంతేకానీ అటువంటి ప్రమాదం వస్తుంది, ప్రపంచం అల్ల కల్లోలం అవుతుంది అని చెప్పి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయరు. కానీ క్యూబాకు చెందిన ఒక జ్యోతిష పండితురాలు మ్హోనీ విడెంటే మాత్రం ప్రజలు ఆందోళన చెందే అంచనాలు తెలిపింది. కాగా ప్రస్తుతం అటు రష్యా యుద్ధం చేస్తుండగా ఇటు చైనా యుద్ధానికి సిద్ధమవుతున్న సమయంలో ఆమె అంచనాలు హాట్ టాపిక్ మారాయి.

బల్గేరియాకి చెందిన వంగ బాబా ఒకప్పుడు చెప్పిన అంచనాల్లో 80 శాతం నిజం అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఆ వంగ బాబా స్థానంలో విడెంటే వచ్చినట్టుంది. మూడో ప్రపంచ యుద్ధం మొత్తం తొమ్మిదేళ్ల పాటు కూడా సాగుతుందని,అందుకు కారణమయ్యే దేశాలలో ప్రధాన దేశంగా చైనా ఉంటుంది అని తెలిపింది. అయితే కరోనా వచ్చిన తర్వాత యుగాంతం పై చర్చ ఎక్కువైందని, ఉక్రెయిన్ పై రష్యా యుద్ధంతో మూడో ప్రపంచ యుద్ధ చర్చలు పెరిగాయి అంటూ ఆ వార్తలకు ఆద్యం పోస్తోంది విడెంటే. అయితే ఆ అంచనాలను నమ్మాలా వద్దా అనేది ఎవరిష్టం వారిదిం అని అంటోంది విడెంటే.

ఉక్రెయిన్, రష్యా యుద్ధం వల్ల మూడో ప్రపంచ యుద్ధం జరిగే అవకాశాలు లేవట. ఎందుకు గల కారణం నాటో దేశాలు తప్ప ఇతర దేశాలేవీ ఉక్రెయిన్ వైపు లేవట. కాబట్టి ఆ యుద్ధం ఆ రెండు దేశాలకే పరిమితం అవుతుందట. జ్యోతిష్య పండితులు 44 ఏళ్ల విడెంటే చెప్పిన ప్రకారం రష్యా అధ్యక్షుడైన వ్లాదిమిర్ పుతిన్ తమ యుద్ధంలోకి మరిన్ని దేశాల్ని లాగుతారట. దానివల్ల ఈ యుద్ధ సమస్య మరింత పెరుగుతుందట. దీని వెనక ఓ సూపర్ పవర్ కూడా ఉంటుంది అని ఆమె చెప్పుకొచ్చింది. అయితే సహజంగా అమెరికాతో చేతులు కలిపి దక్షిణ కొరియా మూడో ప్రపంచ యుద్ధంలో మాత్రం వియత్నాం, ఉత్తర కొరియా, జపాన్‌తో చేతులు కలుపుతుందని ఆమె తెలిపింది. అమెరికాను ఓడించేందుకు చైనా ఎంతకైనా తెగిస్తుందన్న విడెంటే ఫలితంగా మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుందని చెప్పింది.