Site icon HashtagU Telugu

South Africa- Australia: వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌.. ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య ఫైనల్ జరగనుందా?

South Africa- Australia

South Africa- Australia

South Africa- Australia: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసు మరింత ఉత్కంఠగా మారింది. భారత్, ఆస్ట్రేలియా ఇప్పుడు దక్షిణాఫ్రికా (South Africa- Australia) ఫైనల్ ఆడేందుకు బలమైన పోటీదారులుగా మారాయి. శ్రీలంకపై భారీ విజయం సాధించిన తర్వాత దక్షిణాఫ్రికా WTC పాయింట్ల పట్టికలో భారీ జంప్ చేసి ఆస్ట్రేలియాపైకి వచ్చింది. ప్రస్తుతం టీమిండియా ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నప్పటికీ.. ఫైనల్ విష‌యంలో టీమ్ ఇండియాపై డౌట్‌గా ఉంది. డ‌బ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక ఎలా ఉందో ఒక‌సారి చూద్దాం.

శ్రీలంకను ఓడించిన తర్వాత పాయింట్ల ప‌ట్టిక ప‌రిస్థితి ఇదీ!

దక్షిణాఫ్రికా-శ్రీలంక మధ్య 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగుతుండగా.. తొలి మ్యాచ్‌లో ఆఫ్రికా 233 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే రెండో మ్యాచ్‌లో టీమిండియా సులువుగా గెలిస్తే.. టీమ్ ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ కల చెదిరిపోవచ్చు. ఎందుకంటే రెండో మ్యాచ్‌లో గెలవడం ద్వారా ఆ జట్టు మొదటి స్థానానికి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో దక్షిణాఫ్రికా కూడా డ‌బ్ల్యూటీసీ రేసులోకి రానుంది.

Also Read: ICC Chairman Jay Shah: ఐసీసీకి కొత్త అధ్యక్షుడు, ప్రపంచ క్రికెట్‌కు కొత్త బాస్ జై షా.. ఆయ‌న జ‌ర్నీ ఇదే!

టీమ్ ఇండియాకు క‌ష్టాలు

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు ఇప్పుడు 4-0తో సిరీస్‌ను కైవసం చేసుకోవాలి. ఇది జరగకపోతే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాలన్న భారత్ కల కలగానే మిగిలిపోతుంది. అయితే జట్టు 15 మ్యాచ్‌ల్లో 9 విజయాలతో WTC పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. సౌతాఫ్రికా 5 విజయాలతో రెండో స్థానంలో, ఆస్ట్రేలియా 8 విజయాలతో మూడో స్థానంలో ఉన్నాయి. సౌతాఫ్రికా PCT ఆస్ట్రేలియా కంటే ఎక్కువగా ఉంది.

ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య ఫైనల్ జరగనుందా?

ఒకవేళ ఆస్ట్రేలియన్ జట్టు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని గెలిస్తే లేదా సిరీస్‌ను డ్రా చేసుకుంటే టీమ్ ఇండియా WTC ఫైనల్ ఆడదు. దీంతో పాటు న్యూజిలాండ్ జట్టు కూడా ఇంగ్లండ్ ఓడించింది. దీని కారణంగా కివీ జట్టు నాలుగో స్థానంలో ఉంది. ఇప్పుడు ఆ జట్టు ఫైనల్ చేరడం చాలా కష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ రేసు నుంచి భారత్ నిష్క్రమిస్తే ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య WTC ఫైనల్ జ‌ర‌గ‌వ‌చ్చు.

Exit mobile version