Site icon HashtagU Telugu

Vijayendra Prasad: విజయేంద్రప్రసాద్‌ అనే నేను..!

Vijayendra Prasad

Vijayendra Prasad

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఇటీవల రాజ్యసభకు కొత్తగా నామినేట్‌ అయిన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా సభలో ఉన్న విజయేంద్రప్రసాద్‌ను ఆహ్వానించారు. విజయేంద్రప్రసాద్‌ ఆంగ్లంలో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి కోటాలో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ను రాజ్యసభకు ఎంపిక చేసింది. అయితే ‘కశ్మీర్ ఫైల్స్’ తరహాలోనే హైదరాబాద్ స్వాతంత్రోద్యమంతో ముడిపడిన రజాకార్ల ఆగడాలు సైతం తెరకెక్కించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ యోచిస్తున్నారు.

ఈ క్రమంలోనే ‘రజాకార్ ఫైల్స్’ మూవీ గురించి వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. విజయేంద్రప్రసాద్ గతంలో రజాకార్ల ఆగడాలు, అకృత్యాల నేపథ్యంలో నాగార్జున హీరోగా ‘రాజన్న’ తెరకెక్కించారు. ఈ సినిమాకు ఆయన కథ అందించడంతో పాటు దర్శకత్వం కూడా వహించారు. ఈ క్రమంలోనే ‘రజాకార్ ఫైల్స్’ సినిమాకు ఆయన్ని కథ తయారుచేయాలని బండి సంజయ్ కోరినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయమై ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. రజాకార్ ఫైల్స్ ఉంటుందా? లేదా అనేది ప్రస్తుతం సస్పెన్స్ అని చెప్పక తప్పదు.