Site icon HashtagU Telugu

C. Narasimha Rao: నరసింహారావు ఇకలేరు!

Narasimha Rao

Narasimha Rao

సి.నరసింహారావు.. రాజకీయ విశ్లేషకుడు, ప్రముఖ సామాజికవేత్త, రచయిత కూడా. వ్యక్తిత్వ వికాసంపై అనేక పుస్తకాలు రాసిన ఆయన కన్నుమూశారు. వయసు 73 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి దాటిన తర్వాత 1.50 గంటలకు తుదిశ్వాస విడిచారు.

ఆయన స్వస్థలం కృష్ణా జిల్లాలోని పెదపాలపర్రు. 29 డిసెంబరు 1948లో జన్మించారు. ఆయన మృతి విషయం తెలిసి పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నేటి సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణం పట్ల ప్రముఖ రాజకీయ నాయకులు, మేధావులు, రచయితలు సంతాపం వ్యక్తం చేశారు.

ఆయన మరణం విచారకరం – చంద్రబాబు నాయుడు

ప్రముఖ రచయిత, రాజకీయ, సామాజిక విశ్లేషకులు సి.నరసింహారావు గారి మరణం విచారకరం. వ్యక్తిత్వ వికాసం పై ఆయన రాసిన అనేక పుస్తకాలు యువతలో స్ఫూర్తిని నింపాయి. నరసింహారావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను

నిశ్చేష్టుల్ని చేసింది – ఏపీ రైటర్స్

సి.నరసింహారావు హఠన్మరణ వార్త నిశ్చేష్టున్ని చేసింది.వారు సంపాదకులు గా వ్యవహరించిన రేపు పత్రికలో దివిసీమ ఉప్పెన భాదితుల మానసిక సమస్యలపై విశ్లేషణాత్మక వ్యాసం వ్రాశారు. తెలుగులో వ్యక్తిత్వ వికాస గ్రంధాల రచనకు ఆధ్యుడని చెప్పవచ్చు. మానసిక విశ్లేషణాత్మక రచనలు అనేకం చేశారు. సాహితీ రంగానికి వారి మృతి తీరని లోటు.