GT vs LSG: తొందర్లో ప్యాంటు రివర్స్ వేసుకున్న వృద్ధిమాన్..

ఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ ఫన్నీ సన్నివేశం చోటు చేసుకుంది. ఓ ఆటగాడు తొందర్లో ప్యాంటు రివర్స్ లో వేసుకుని వచ్చాడు

Published By: HashtagU Telugu Desk
GT vs LSG

Whatsapp Image 2023 05 07 At 7.15.17 Pm

GT vs LSG: డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ ఫన్నీ సన్నివేశం చోటు చేసుకుంది. ఓ ఆటగాడు తొందర్లో ప్యాంటు రివర్స్ లో వేసుకుని వచ్చాడు. ఇంకేముంది ఈ ఫన్నీ సన్నివేశం సోషల్ మీడియాలో చర్చకు తెరతీసింది. కొందరు నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మెమెర్స్ కి ఇదొక స్టఫ్ లా దొరికినట్లయింది.

ఈ రోజు నరేంద్ర మోదీ స్టేడియంలో లక్నో, గుజరాత్ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్‌కు శుభారంభం లభించింది. జట్టు తరఫున ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా, శుభ్‌మాన్ గిల్ మధ్య అద్భుతమైన సెంచరీ భాగస్వామ్యం సాధించారు. దీంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఇక ఇన్నింగ్స్ తరువాత లక్నో బ్యాటింగ్ కు దిగింది. సెకండ్ ఇన్నింగ్స్ మొదలైన తొందర్లో గుజరాత్ కీపర్ వృద్ధిమాన్ సాహా ప్యాంటు రివర్స్ లో వేసుకుని వచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫన్నీ కామెంట్స్ తో ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నారు. మెమెర్స్ అప్పుడే మీమ్స్ తో హల్చల్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో, వృద్ధిమాన్ సాహా 43 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 81 పరుగులు చేశాడు. 200 స్ట్రైక్ రేట్ వద్ద సాహా అద్భుతంగా బ్యాటింగ్ చేసి గుజరాత్ జట్టుకు శుభారంభం అందించాడు.

Read More: RR vs SRH Dream11 Prediction: RR vs SRH పిచ్ రిపోర్ట్..

  Last Updated: 07 May 2023, 07:17 PM IST