Site icon HashtagU Telugu

Wrestlers protest: మరింత ముదురుతున్న రెజ్లర్ల ఉద్యమం.. ఆందోళనను విరమించేది లేదంటూ?

Wrestlers Protest

Wrestlers Protest

గత నెల రోజులుగా రెజ్లర్ల ఉద్యమం కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది. తప్పుడు ప్రచారాలను చేయవద్దంటూ రెజ్లర్ సాక్షి మాలిక్ తెలిపింది. ఈ ఉద్యమాన్ని రెజ్లర్లు ఇంకా తీవ్రతరం చేస్తూనే ఉన్నారు. బిజెపి ఎంపీ డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. కాగా రెజ్లర్ల పోరాటానికి పలువురు నేతలు కూడా మద్దతు పలుకుతున్నారు. కాగా వారి పథకాలను హరిద్వార్ లోని గంగా నదిలో కలిపేందుకు రాగా వారిని అడ్డుకొని ఐదు రోజుల గడువును కూడా విధించారు.

ఆ గడువు ముగియడంతో తాజాగా కేంద్ర హోం మంత్రి శాఖ అమిత్ షాతో సమావేశం అయ్యారు. అయితే అమిత్ షా సమాధానం పై రెజ్లర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా రెజ్లర్ల ఆందోళనలో కీలకంగా వ్యవహరిస్తున్న సాక్షి మాలిక్ ఈ ఉద్యమం నుంచి తప్పుకున్నట్లు విరమించుకున్నట్లు టీవీలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఉత్తర రైల్వేలో తన పదవిలో చేరినట్లు కూడా వార్తలు వినిపించాయి. ఇదే విషయం పై సాక్షి మాలిక్ స్పందించింది. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. నిరసన నుంచి తాను కానీ వినేష్ ఫోగట్ కానీ, బజరంగ్ పూనియా కానీ తప్పకుండా లేదు అని సాక్షి మాలిక్ తెలిపింది.

మేము ముగ్గురూ రెజ్లర్ల నిరసన నుంచి తప్పుకుంటున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం అని ఆమె తెలిపింది. తాము తమ ఉద్యోగాలలో తిరిగి చేరమే తప్ప నిరసన మంచి తప్పుకోలేదని ఆమె తెలిపింది. అంతే కాకుండా వారికి న్యాయం జరిగేంత వరకు పోరాడతానని ఆమె స్పష్టం చేసింది. అయితే రెజ్లర్ల ఆవేశం, పట్టుదల చూస్తుంటే ఇప్పట్లో ఆందోళన విరమించుకునేలా కనిపించడం లేదు. మరి ఇంకా ఈ ఉద్యమం ఎన్ని రోజులపాటు కొనసాగుతుందో చూడాలి మరి.

Exit mobile version