Site icon HashtagU Telugu

Himachal Pradesh: వామ్మో ఇదెక్కడ వింత ఆచారం.. ఆ ఐదు రోజులు మహిళలు దుస్తులు వేసుకోరట?

Whatsapp Image 2023 02 13 At 19.15.00

Whatsapp Image 2023 02 13 At 19.15.00

Himachal Pradesh: సమాజం అన్ని విషయాలలో ముందుకు పోతూనే ఉంది. కానీ కొన్ని వింత ఆచారాల విషయంలో మాత్రం వెనుకబడే ఉంది. ఇప్పటికే పలుచోట్ల ఎన్నో వింత వింత ఆచారాలు చూస్తున్నాం. ఆ ఆచారాలు పాటించిన వాళ్ళని చూస్తే మరింత ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండటంతో.. కొన్ని కొన్ని ప్రాంతంలో జరుగుతున్న వింత ఆచారాలు నేరుగా సోషల్ మీడియా ద్వారా బయటపడుతున్నాయి.

అయితే తాజాగా ఒక వింత ఆచారం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే మహిళలు ఏకంగా ఐదు రోజులు దుస్తులు ధరించకుండా ఉంటారట. అదేంటి మహిళలు దుస్తులు వేసుకోకుండా ఉండటం ఏంటి.. ఇదెక్కడ ఆచారం అనుకుంటున్నారా. కానీ ఇది నిజమే. అసలు విషయం ఏంటంటే.. హిమాచల్ ప్రదేశ్ లో కులు (D) పిని గ్రామంలో నివసించే మహిళలు ప్రతి ఏటా వచ్చే శ్రావణ మాసంలో ఐదు రోజులు దుస్తులు ధరించకుండా ఉంటారట.

అలా కాకుండా పలుచటి బట్టలతోనైనా ఉంటారట. గతంలో రాక్షసులు మహిళల దుస్తులు చింపి తీసుకెళ్లే వారట. ఇక అప్పుడు వచ్చిన ఒక దేవత అక్కడి ప్రజలను కాపాడటంతో అప్పటినుంచి ఇటువంటి ఆచారంను పాటిస్తున్నారట. ఇక ఈ ఐదు రోజులు గ్రామంలో బయటి వారిని కూడా రానివ్వరట. భార్యాభర్తలు దూరంగా ఉంటారట. ఇక మగవాళ్ళు మద్యం, మాంసం అటువంటి వాటికి దూరంగా ఉంటారట.

అలా కాకుండా ఆ ఆచారాన్ని ఉల్లంఘిస్తే కీడు జరుగుతుంది అని అక్కడి ప్రాంత ప్రజల నమ్మకం. అయితే ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలలో వైరల్ అవ్వటంతో.. ఇదెక్కడి వింత ఆచారం అంటూ.. సమాజం అన్ని విషయాలలో ముందుకు పోతుంది కానీ.. ఇటువంటి విషయంలో మాత్రం ఇంకా వెనుక బడే ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.