ఆ రత్నం(రూబీ).. వరల్డ్ రికార్డు సృష్టించే రేంజ్ లో ధర పలికింది.
55.22 క్యారెట్ల అరుదైన ఈ రూబీని అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న సోత్ బైస్ (Sotheby’s) లో వేలం వేయగా రూ.286 కోట్ల(286 Crores Ruby) ధర పలికింది.
ఇంత రేటు పొందిన ఈ రూబీ పేరు.. ఎస్ట్రెలా డి ఫురా(Estrela de Fura)
దీన్ని మొజాంబిక్‌లోని ఫ్యూరా జెమ్స్ కంపెనీ నిర్వహిస్తున్న మోంటెప్యూజ్ రూబీ గనిలో 2022 జూలైలో గుర్తించారు.
101 క్యారెట్ల కఠినమైన రాయి నుంచి ఆ రత్నం బయటపడింది.
ఈ రత్నం వేలంపాట తొలుత రూ.173 కోట్లతో మొదలైంది. పోటాపోటీగా ఔత్సాహికులు బిడ్స్ వేయడంతో ధర మరో 100 కోట్లు రేటు పెరిగింది.
Also read : Malavika Nair: ఆ జాతిరత్నంని ఉంచుకుంటా.. ప్రముఖ హీరోయిన్ కామెంట్స్ వైరల్?
ఈ రూబీ బయటపడిన మొజాంబిక్ దేశం ఇప్పుడు ప్రపంచంలోనే రూబీ మైనింగ్ ఎక్కువగా జరిగే దేశాలలో ఒకటి. 2009 తర్వాత అక్కడి గనుల రంగానికి రూబీ మైనింగ్ ఒక ముఖ్యమైన పరిశ్రమగా మారింది. ప్రత్యేకించి అక్కడి మోంటెప్యూజ్ నగరం ఇందుకు ఫేమస్. రత్నాల రాళ్ల భారీ నిక్షేపాలు ఆ సిటీలో ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచి వెలికితీసిన విలువైన రాళ్లలో ఒకటే ఇప్పుడు వేలంపాటలో రూ.286 కోట్ల(286 Crores Ruby) ధర పలికిన ఎస్ట్రెలా డి ఫురా రత్నం. ఇది “పావురం యొక్క రక్తం” (pigeon’s blood)గా పిలిచే ముదురు ఎరుపు రంగును కలిగి ఉంది. ఇలాంటి రత్నాలను కత్తిరించి, పాలిష్ చేసి, మలినాలను తొలగించి, మార్కెట్‌లోకి తీసుకురావడం వెనుక ఎంతో శ్రమ ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇక పాత రికార్డుల్లోకి వెళితే.. 2015లో స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ఉన్న సోత్ బైస్ ద్వారా 25.59 క్యారెట్ల బర్మీస్ రూబీని వేలం వేయగా రూ.250 కోట్ల ధర పలికింది.
