Site icon HashtagU Telugu

First Robot Lawyer : ప్రపంచంలోనే తొలి రోబో లాయర్..!

Robot Lawyer

Robo Layaer

ప్రపంచంలోనే తొలి రోబో లాయర్‌ (Robot Lawyer) కేసును లాయర్‌ మాదిరిగా సలహాలిచ్చి కేసును వాదించుకునేలా గైడ్‌ చేస్తుంది. 2015లో జాషువా బ్రౌడర్‌ అనే శాస్త్రవేత్త రోబో లాయర్‌ని రూపొందించారు. ఆయన డూనాట్‌పే లీగల్‌ సర్వీస్‌ చాట్‌బోట్‌ అనే ఒక స్టార్ట్‌అప్‌ కంపెనీని స్థాపించి న్యాయ సేవలను అందిస్తున్నారు. దీనికి సంబంధించిన అప్లికేషన్‌ స్మార్ట్‌ఫోన్‌లో రన్‌ అవుతోంది. నిజ జీవితంలోని కేసులన్నింటిని హెడ్‌ఫోన్‌ సాయంతో విని తన క్లయింట్‌కి సలహలు, సూచనలు ఇస్తుంది.

ప్రస్తుతం ఈ రోబో యూకేలోని ట్రాఫిక్‌ టిక్కెట్‌కి సబంధించిన ప్రతివాది కేసును వచ్చే నెలలో వాదించనుంది. ఈ కేసుకు సంబంధించి రోబోకి శిక్షణ ఇవ్వడానికి చాలా సమయం పట్టిందని బ్రౌడర్‌ అన్నారు. ఫిబ్రవరిలో యూకే కోర్టులో ఈ కేసు విచారణ జరగనున్నట్లు తెలిపారు. కోర్టులో సమాచారాన్ని ప్రాసెస్‌ చేసి, వాదనలను విశ్లేషించి తన క్లయింట్‌కి తగిన సలహాలిస్తుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ సాయంతో రూపొందించిన ఈ రోబో లాయర్‌ (Robot Lawyer) తొలుత కేసులకు సంబంధించిన జరిమానాలు, ఆలస్యంగా చెల్లించే రుసుమలు విషయంలో వినియోగదారులకు చట్టపరమైన సలహాలు అందించేది. ఇప్పుడూ ఏకంగా కేసును లాయర్‌ మాదిరిగా టేకప్‌ చేసి క్లయింట్‌ని తగిన విధంగా గైడ్‌ చేసి వాదించుకునేలా చేస్తుంది.

యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌లో ఇంకా చాలా మంది మంచి లాయర్లు ఉంటారు, కానీ చాలా మంది లాయర్లు డాక్యుమెంట్‌లను కాపీ చేసి పేస్ట్ చేయడానికి చాలా ఎక్కువ డబ్బు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఈ సమస్యలన్నింటికీ ఈ రోబో లాయర్‌ చెక్‌ పెడుతుందని ఆనందంగా వెల్లడించారు సైంటిస్ట్‌ బ్రౌడర్.

Also Read:  Rishi Sunak : రిషి సునాక్ కు రానున్న సాధారణ ఎన్నికల్లో ఎదురుదెబ్బ..?