Site icon HashtagU Telugu

World Deepest Hotel: ప్రపంచంలోనే అత్యంత లోతులో ఉన్న హోటల్ ఎక్కడ ఉందో తెలుసా?

C6c7f257 35e9 49f9 84c4 Bbd540db2c00

C6c7f257 35e9 49f9 84c4 Bbd540db2c00

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల హోటల్స్ ఉన్న విషయం తెలిసిందే. అందులో చిన్నచితికా హోటల్ నుంచి పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ ఫొటోస్ వరకు ఉన్నాయి. ఫైవ్ స్టార్ హోటల్స్ కంటే ఇంకా ఖరీదైన హోటల్స్ కూడా చాలానే ఉన్నాయి. అయితే ఇప్పటివరకు మనం చూసిన హోటల్స్ ఎక్కువ శాతం బీచ్ ఏరియాలో అటవీ ప్రాంతంలో లేదంటే సముద్ర గర్భంలో ఉంటాయి. ఉపరితలం మీద మాత్రమే కాకుండా భూగర్భంలో కూడా అనేక రకాల హోటల్స్ ఉన్నాయి. అలాంటి వాటిలో బ్రిటన్‌ లోని ది డీప్‌ స్లీప్‌ హోటల్‌ ఒకటి. భూగర్భంలో ఏర్పాటు చేసిన ఈ హోటల్ ప్రపంచంలోనే అత్యంత లోతైన హోటల్‌ గా గుర్తింపు పొందింది.

దీన్ని చేరుకునేందుకు ఒక సాహస యాత్రే చేయాల్సి ఉంటుంది. బండరాళ్ల గనుల గుండా ట్రెక్కింగ్‌ చేస్తూ అనేక పురాతన వంతెనలు, మెట్ల బావులు దాటుకుంటూ కఠిన దారుల్లో గంటకు పైగా నడక సాగించాలి. బ్రిటన్‌ నార్త్‌ వేల్స్‌లోని ఎరారీ నేషనల్‌ పార్క్‌లో పర్వతాల కింద ఈ హోటల్‌ను నిర్మించారు. భూఉపరితలానికి దాదాపు 400 మీటర్లకు అనగా 1375 అడుగులకు పైగా లోతులో ఉంది. డీప్ స్లీప్ హోటల్‌లో రెండు పడకలతో కూడిన నాలుగు ప్రైవేటు క్యాబిన్‌లు, డబుల్ బెడ్‌తో కూడిన ఒక ప్రత్యేక గుహను గదివలే తీర్చిదిద్దారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు అద్దెకు తీసుకోవచ్చు.

ప్రైవేటు క్యాబిన్‌లో ఇద్దరి బసకు 350 పౌండ్లు అనగా రూ.36 వేలు, గుహ గదికిగానూ 550 పౌండ్లు అనగా రూ.56 వేలు చెల్లించాలి. అయితే ఈ హోటల్‌లో బస చేయాలనుకునేవారు ముందుగా ట్రిప్ లీడర్‌ వెంట పాడుబడిన విక్టోరియన్ బండరాళ్ల గనుల గుండా ట్రెక్కింగ్ చేయాలి. మెట్ల బావులు, పాత వంతెనలు దాటుకుంటూ కఠిన మార్గాల్లో గంటపాటు ప్రయాణించాలి. చివరకు ఒక పెద్ద ఉక్కు తలుపు ప్రవేశ ద్వారాన్ని సూచిస్తుంది. ప్రయాణ మార్గంలో అతిథులకు హెల్మెట్, లైట్, బూట్లు ఇతరత్రా వస్తువులు సమకూరుస్తారు. ఈ హోటల్‌లో గడిపినవారు తమ జీవితంలోనే మంచి నిద్రను పొందామంటూ చెబుతున్నారని ఆ హోటల్ నిర్వాహకులు తెలిపారు.