Site icon HashtagU Telugu

World Photography Day : ప్రపంచంలోనే తొలి ఫోటోను తీశాక ఏమైందో తెలుసా ?

World Photography Day

World Photography Day

World Photography Day :  మానవ జన్మ ఒక వరం.. ఒక గొప్ప అవకాశం.. 

ఈ మధుర జీవితంలోని సుమధుర జ్ఞాపకాల్ని పది కాలాల పాటు పదిలంగా నిలిపి ఉంచే మహత్తర శక్తి  ఫోటోకు ఉంది..  

మన ఇంట్లో ఉన్న ఫోటోల ఆల్బమ్ ను ఒక్కసారి తడిమి చూస్తే ఎంతో సంతోషాన్ని పంచుతుంది. ఎంతో శక్తిని అందిస్తుంది.. 

ఒక శ్రేయోభిలాషిలా  గత జ్ఞాపకాలను మనకు గుర్తు చేస్తుంది.. 

ఈరోజు (ఆగస్టు 19) ‘వరల్డ్ ఫోటోగ్రఫీ డే’ సందర్భంగా కథనమిది..  

Also read : Green Tax Burden : గ్రీన్ ట్యాక్స్ ఏపీలో ఎక్కువ.. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లో తక్కువ.. ఎందుకు ?

ఫ్రాన్స్‌కు చెందిన జోసెఫ్ నైసిఫోరా నీప్సి తొలిసారిగా 1826లో ప్రపంచంలోనే తొలి ఫోటోను తీశారు. తన ఇంటి వెనుక ఉన్న పెరట్లో సిల్వర్‌ అణువుల ప్లేట్‌ పై 8 గంటలపాటు ఈ ఫోటోను బంధించి ఉంచారు.  అయితే ఆ ఫోటో సిల్వర్‌ ప్లేట్‌ పై దాన్ని ఎక్కువ రోజుల పాటు  ఉండేలా చేయలేకపోయారు. ఆ ఫోటో ఆకృతి పూర్తిగా చెదిరిపోయింది. ఈ లోటుపాట్లను అధిగమించేలా లూయిస్ జే.ఎం డాగ్యూరే 1837లో సరికొత్త ఫోటోగ్రఫీ పద్ధతిని కనుగొన్నారు. ఈ విధానానికి ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌ ఆమోదముద్ర వేసింది. రసాయనాలతో రూపొందించిన ప్లేటుపై కాంతిచర్యతో ఓ రూపాన్ని బంధించడమే ఫోటోగ్రఫీ. ఫోటోగ్రఫీ అనే పదం ఫోటో, గ్రాఫీ అనే గ్రీకు పదాల కలయికగా ఏర్పడింది. ఫోటో అంటే కాంతి, గ్రాఫీ అంటే తీసుకోవడం అని అర్ధం. 1839 ఆగస్టు 19న ఫ్రాన్స్‌ ప్రభుత్వం ఫొటోగ్రఫీపై పేటెంట్ హక్కులను కొనుగోలు చేసి దానిని ప్రపంచానికి ఉచిత బహుమతిగా అందించింది. అప్పటి నుంచి ఏటా ఆగస్టు 19న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం (World Photography Day) నిర్వహిస్తున్నారు.

అప్పట్లో మనదేశంలో.. 

అప్పట్లో మనదేశంలో బ్రిటీష్ ఉన్నతాధికారులు, జమీందార్లు, సైనికులు మాత్రమే ఫోటోగ్రఫీని ఉపయోగించేవారు. 1840 లో ఇండియాలో ఫోటోగ్రఫీ ఆనవాళ్లు ఉన్నాయి. మొట్టమొదటి కేలోటైప్ ఫోటో స్టూడియో కోల్‌కతాలో స్ధాపించారు. మొదట్లో దీనిని బ్రిటీష్ రాజు, జమిందార్లు మాత్రమే ఉపయోగించేవారట. ఆ తరువాత 1877 నుంచి అందరికీ అందుబాటులోకి వచ్చింది. మొట్ట మొదటి కలర్ ఫోటో 1861 లో తీశారట.

Also read : Aadhaar Updation: ఆధార్ ని ఉచితంగా అప్‌డేట్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..!

కెమెరాలు ఇలా మారాయి.. 

మొదట ఫోటోగ్రఫీ కెమెరాలు చాలా పెద్దగా ఉండేవి. కాలక్రమంలో ఎయిమ్ అండ్ షూట్ కెమెరాలు, ఫీల్డ్ కెమెరాలు, డోనల్ కెమెరాలు, డిజిటల్ సింగిల్ లేన్స్ రిఫ్లెక్ట్, ఫ్లై కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. కాగా.. ఒకప్పుడు రీల్స్‌తో ఫోటోలు తీసే స్థాయి నుంచి ఇప్పుడు చిన్న మెమోరీ కార్డుతో వందలాది ఫోటోలు తీసే స్థాయికి ఫోటోగ్రఫీ చేరుకుంది. అయితే ఇది ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది మాత్రం 1910 సంవత్సరంలోనే!! ‘వరల్డ్ ఫోటోగ్రఫీ డే’ను తొలిసారిగా  1910 ఆగస్టు 19న జరుపుకున్నారని అంటారు. ఇండియా ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫిక్ కౌన్సిల్ 1991 నుంచి ప్రతి ఏటా ఆగస్టు 19 న ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరపడం ప్రారంభించింది.