World Left Handers Day: ఎడమ చేతి వాటం ఉన్నవారిలో ఎన్ని ప్రత్యేకతలు ఉంటాయో తెలుసా.. పూర్తిగా తెలుసుకోండిలా!

ఎడమ చేతి వాటం.. ఇది చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. ప్రతి 100 మందిలో 20 మంది మాత్రమే లెఫ్ట్

Published By: HashtagU Telugu Desk
World Left Handers

World Left Handers

ఎడమ చేతి వాటం.. ఇది చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. ప్రతి 100 మందిలో 20 మంది మాత్రమే లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు. ఇలా ఎడమ చేతి వాటం కలిగిన వారు చేసే పనులను కాస్త మనం ప్రత్యేకంగా చూస్తూ ఉంటాం. అయితే ఈ ఎడమ చేతివాటం కేవలం జన్యు ప్రభావం వల్ల ఏర్పడుతుంది అని పరిశోధనలో తేలిందట. ఇకపోతే నేడు అనగా ఆగస్టు 13న ప్రపంచ లెఫ్ట్ హ్యాండర్స్ డే ని జరుపుకుంటారు. అయితే కుడి చేతివాటం ఉన్న వారితో పోల్చుకుంటే ఎడమ చేతివాటం ఉన్నవారు ఉన్నత స్థాయిలో ఉంటారట.

అదేవిధంగా వారికి తెలివితేటలు గ్రహించే శక్తితో పాటుగా మంచి ఆలోచన శక్తి కూడా ఉంటుందట. మన దేశ ప్రధాన నరేంద్ర మోడీ కూడా ఎడమ చేతితోనే రాస్తారట. క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, అమెరికా మాజీ ప్రెసిడెంట్ ఒబామా, అలాగే సినీనటుడు అమితాబచ్చన్, హీరోయిన్ సావిత్రి ఇలా ఎంతో మంది ఎడమ చేతి వాటం కలిగిన వారే. అయితే ఎడమ చేతి వాటం ఉన్న వారిలో క్రియేటివిటీ, మ్యూజిక్, ఆర్ట్స్‌ అధికంగా ఉంటాయట. వీరికి మాట్లాడే శక్తి, అర్థం చేసుకునే సామర్థ్యం మెండుగా ఉంటుంది.

అయితే ఎడమ చేతి వాటం ఉన్న వాళ్లు ఎదైనా చూడాలంటే మొదట ఎడమ కన్నుతోనే చూస్తారు. మహిళలకు మాత్రం సృజనాత్మకతో పాటు మెదడు చురుగ్గా పనిచేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎడమ చేతివాటం వారు వేగంగా, సులభంగా పనులు మంచి టెక్నిక్‌తో పూర్తి చేస్తారు. వీరికి మెమొరీ పవర్, ఐక్యూ అధికంగా ఉన్నప్పటికీ చిన్న చిన్న విషయాలు వెంటనే మరచిపోగలరు.

  Last Updated: 14 Aug 2022, 12:22 AM IST