World Cup Trophy: తాజ్‌మహల్‌ వద్ద వరల్డ్ కప్ ట్రోఫీ, ఫొటో షేర్ చేసిన ఐసీసీ

సరిగ్గా ఇంకో 50 రోజుల్లో మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ప్రపంచ కప్‌ను తాజ్‌మహల్‌ వద్ద ఉంచిన ఫొటోను ఐసీసీ షేర్‌ చేసింది.

Published By: HashtagU Telugu Desk
Upcoming ICC Tournaments

Upcoming ICC Tournaments

World Cup Trophy: ప్రపంచంలో ప్రతి క్రికెటరూ అందుకోవాలనుకునే ట్రోఫీ.. ప్రతి క్రికెట్‌ అభిమానిలోనూ ఉద్వేగాన్ని రేకెత్తించే టోర్నీ అది. నాలుగేళ్లకోసారి జరిగే ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి ఈసారి భారత్‌ వేదిక. సరిగ్గా ఇంకో 50 రోజుల్లో మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ప్రపంచ కప్‌ను తాజ్‌మహల్‌ వద్ద ఉంచిన ఫొటోను ఐసీసీ షేర్‌ చేసింది. అభిమానులు అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్న వన్డే ప్రపంచకప్‌ టికెట్ల నమోదు మొదలైంది. ఆగస్టు 25న ఆరంభమయ్యే టికెట్ల అమ్మకాలకు ముందు అభిమానులు ముందుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని ఐసీసీ కోరింది.  ప్రస్తుతం ఈ రిజిస్ట్రేషన్‌ లింక్‌ అందుబాటులోకి వచ్చింది.  www.cricketworldcup.com లింక్‌ను క్లిక్‌ చేసి అభిమానులు ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

Also Read: KCR Strategy: ఆ ఎమ్మెల్యేలకు కేసీఆర్ టికెట్లు ఇస్తారా..? పక్కన పెట్టేస్తారా?

  Last Updated: 16 Aug 2023, 05:01 PM IST