Site icon HashtagU Telugu

world cup 2023: సెంచరీ మిస్ చేసుకున్న కోహ్లీ, గిల్

New Webworld Cup 2023story

New Webworld Cup 2023story

world cup 2023:  ముంబై వాంఖడే వేదికగా టీమిండియా శ్రీలంకతో తలపడుతుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. దిల్షాన్ బౌలింగ్ లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఔట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. 2 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ ఫోర్ బాది పెవిలియన్ చేరాడు. మరో ఎండ్ లో గిల్ ఎటాకింగ్ మొదలు పెట్టాడు. ఆరంభం నుంచే ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గిల్ సెంచరీకి చేరువలో కీపర్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 92 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 92 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అయితే గిల్ అవుట్ అవ్వగానే కోహ్లీ కూడా అవుట్ అయ్యాడు. ఇనింగ్స్ లో విరాట్ 94 బంతుల్లో 11 ఫోర్ల సహాయంతో 88 పరుగులు చేశాడు. సెంచరీ చేస్తారనుకున్న ఈ స్టార్ ఆటగాళ్లు సెంచరీ చేరువలో అవుట్ అవ్వడం ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపరిచింది.

శ్రీలంక జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగింది. ధనంజయ్ డి సిల్వా స్థానంలో దుష్మంత్ హేమంత్‌ను జట్టులోకి తీసుకున్నారు. టీమిండియాలో ఎలాంటి మార్పు లేకుండానే బరిలోకి దిగింది. శ్రేయాస్ అయ్యర్ ని పక్కనపెట్టి ఇషాన్ కిషన్ ని తీసుకుంటారని భావించినా రోహిత్ అండ్ ద్రవిడ్ ఎలాంటి ప్రయోగాలకు వెళ్లలేదు.

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ మరియు మహ్మద్ సిరాజ్.

శ్రీలంక జట్టు: పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్ (కెప్టెన్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, దుష్మంత హేమంత, ఏంజెలో మాథ్యూస్, దుష్మంత చమీర, మహిష్ తీక్షణ, కసున్ రజిత్ మరియు దిల్షన్ మధుశంక.

Also Read: world cup 2023: వాంఖడేలో శతక్కొడుతున్న కోహ్లీ, గిల్