World Alzeemers Day : మతిమరుపుకి ఒకరోజు ఉందండోయ్..!

వరల్డ్ అల్జీమర్స్ డే.. ప్రపంచ మతిమరుపు దినోత్సవం (World Alzeemers Day). అదేంటి మతిమరుపుకి అంటూ ఒక సెపరేట్ రోజు ఉండటం ఏంటని ఆశ్చర్యపోవచ్చు.

Published By: HashtagU Telugu Desk
World Alzeemers Day Awarene

World Alzeemers Day Awarene

వరల్డ్ అల్జీమర్స్ డే.. ప్రపంచ మతిమరుపు దినోత్సవం (World Alzeemers Day). అదేంటి మతిమరుపుకి అంటూ ఒక సెపరేట్ రోజు ఉండటం ఏంటని ఆశ్చర్యపోవచ్చు. ప్రపంచ అల్జీమర్స్ డే నాడు అల్జీమర్స్ మీద అవగాహన కల్పించడం, పరిశోధనలను ప్రోత్సహించడం వ్యాధి గ్రస్థులను సమర్ధించడం కోసం ఏర్పాటు చేశారు. అల్జీమర్స్ రోజులు ఇంకా వారి కుటుంబాలకు మద్ధతునిచ్చే రోజుగా పరిగణిస్తారు.

వరల్డ్ అల్జీమర్స్ దినోత్సవాన్ని (World Alzeemers Day) ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21న జరుపుకుంటారు. ఆ వ్యాధి ఇతర రకాల వైకల్యాల గురించి అవగాహన కల్పించడానికి ఈరోజు అంకితం చేయబడింది. మెదడు రుగ్మతలతో వచ్చే ఈ వ్యాధి మెదడులోని కణాల్లో బీటా అమిలాయిడ్ అని పిలిచే అసాధారణ పొటీన్ నిక్షేపణ కారణంగా ఏర్పడుతుంది. అవి తగ్గిపోవడం లేదా చనిపోవడం వల్ల ఈ రుగ్మతలు ఏర్పడుతాయి. అల్జీమర్స్ తో బాధపడుతున్న వ్యక్తులు జ్ఞాపక శక్తి క్షీణించడం ఆలోచించలేకపోవడం, ప్రవర్తనా సమస్యలు నిరాశ వంటి లక్షణాలు కలిగి ఉంటారు.

అల్జీమర్స్ ప్రారంభ లక్షణాలు అంత తీవ్రంగా ఉండవు. అందుకే చాలా సందర్భాల్లో ఇది నిర్లక్ష్యం చేయబడుతుంది. అల్జీమర్స్ వ్యాధి వివిధ దశల్లో నిర్ధారణ అవుతుంది. కాలం గడుస్తున్నా కూద్దీ ఈ వ్యాధి తీవ్రతరమవుతుంది. మతిమరుపు కూడా ఒక వ్యాధేనా అనుకోవచ్చు. ఎంత పెద్దది కాకపోతే దీని మీద సినిమాలు కూడా వస్తాయి. అంతేకాదు మతిమరుపు అనేది మన తీసి పారేసే చిన్న సమస్య కాదు కాబట్టే దానికంటూ వరల్డ్ అల్జీమర్స్ డే అని ప్రత్యేకమైన రోజు కేటాయించారు.

మరి మీరు కూడా తరచు ఏదైనా మతిమరుపుగా ప్రవర్తన కలిగి ఉంటే వెంటనే టెస్ట్ చేయించుకోవడం మంచిది.

Also Read : Internation Day of Peace : నేడు అంతర్జాతీయ శాంతి దినోత్సవం..!

  Last Updated: 21 Sep 2023, 10:03 AM IST