Over Weight in Ladies: అధిక బరువుతో బాధపడుతున్న మహిళలు.. బరువు తగ్గాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

  • Written By:
  • Publish Date - July 7, 2022 / 05:25 PM IST

అధిక బరువు.. ప్రస్తుత రోజుల్లో చాలామందిని విపరీతంగా వేధిస్తున్న సమస్య ఇది. పురుషులతో పోల్చుకుంటే మహిళల్లో అధికంగా బరువు ఉన్నవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అధిక బరువు మహిళలకు పెను విపత్తుగా మారుతోందని, శారీరక శ్రమ లోకపోవడం వల్ల కదలకుండా చేసే పనులతో స్థూలకాయం పెరిగిపోతుందని చూచిస్తున్నారు. అదేవిధంగా హార్మోన్ల లోపంతో నెలసరి చిక్కులు థైరాయిడ్, మధుమేహం, క్యాన్సర్ వంటి సమస్యలు వస్తున్నాయని వీటికి పరిష్కారం అధిక బరువును వదిలించుకోవడమే అని డాక్టర్లు సూచిస్తున్నారు.

మరి అధిక బరువు తగ్గించుకోవడానికి ఏమేం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. మహిళలు ఇంటి పని ఉద్యోగం చేయడంతో పాటు వేలకు సరిగా భోజనం చేయకపోవడంతో జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటుండడంతో తొందరగా ఊబకాయం వచ్చేస్తోంది. ఇంట్లో శ్రమ తగ్గిపోవడం కార్యాలయాల్లో ఎక్కువగా సమయం కూర్చోవడంతో విపరీతంగా పరువు పెరిగిపోతున్నారు. ఇంకొందరు మహిళలు అయితే గర్భవతిగా ఉన్నప్పుడు ఆహారం, మందులు వల్ల కూడా విపరీతంగా బరువు పెరుగుతారు.

అయితే మహిళల్లో కొవ్వు పేరుకొనిపోవడం రెండు రకాలుగా ఉంటుంది. అందులో పై భాగంలో పేరుకున్న కొవ్వు పెరిగిన తీరును యాపిల్ ఆకృతిగా పొట్ట కింది భాగంలో కొవ్వు పెరిగితే బొప్పాయి పండు ఆకృతిగా పిలుస్తూ ఉంటారు. అయితే శరీరంలో పై భాగంలో ఎక్కువ కొవ్వు పేరుకు పోతే సమస్యలు వస్తాయి అని చెబుతున్నారు. చాతి ఉదరం పొట్ట బాగాల్లో కొవ్వు పెరిగితే కాలేయం, క్లోమం, గుండె, కిడ్నీలు, జీర్ణ మండలానికి సమస్యల తాకిడి అధికంగా ఉంటుందట. అలాగే ఇన్సులిన్ నిరోధకత పెరిగి మధుమేహం వస్తుందని, అలా హార్మోన్ల అసమతుల్యంతో రుతుస్రావంలో మార్పులు అండాశయంలో గడ్డలు వస్తాయట.

అయితే భోజనం మానేయడం, పండ్లు తినడం, చపాతీకి పరిమితం కావడం మంచిది కాదు. అన్ని రకాల కాయగూరలు, ఆకుకూరల భోజనం, అల్పాహారం సరిపడినంత తిని, ఫోను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. అదేవిధంగా కొవ్వు ఎక్కువగా ఉండే మాంసాహారాలు మానేయాలి. కూల్ డ్రింక్స్ తాగకూడదు. శారీరక శ్రమతో పాటు వీళ్ళకి భోజనం చేయడం కూడా అలవాటు చేసుకోవాలి. అలాగే సమయానికి నిద్ర పోవాలి. అయితే ఇవన్నీ చేసిన తర్వాత కూడా బరువు తగ్గకపోతే వైద్యులను సంప్రదించడం మేలు.