Women Health : మహిళలు, ఈ ఐదు పళ్లు తింటే మీ గుండె పదిలం..!!

గుండెజబ్బులు ఈరోజుల్లో సాధారణమయ్యాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికి వస్తున్నాయి. మహిళల్లో గుండె జబ్బులు తక్కువ అంటుంటారు.

  • Written By:
  • Publish Date - September 5, 2022 / 08:01 PM IST

గుండెజబ్బులు ఈరోజుల్లో సాధారణమయ్యాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికి వస్తున్నాయి. మహిళల్లో గుండె జబ్బులు తక్కువ అంటుంటారు. కానీ ఈ రోజుల్లో మహిళలకు కూడా మినహాయింపు లేకుండా పోయింది. రుతుసమస్యలు, గర్భదారణ సమస్యలు, మెడిసిన్ ఎక్కువగా తీసుకోవడం, హార్మోన్ల హెచ్చుతగ్గులు ఇలా అనేక కారణాలు మహిళల గుండె ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తున్నాయి. పోషకాహారం, ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ప్రతి ఒక్కరికీ ఇవే కీలక మార్గాలు. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ అలవాట్లు ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలను నివారిస్తాయి.

మహిళల ఆరోగ్యానికి ఉపయోగపడే పండ్లు..

వాల్ నట్స్….
వీటిని ఏ రూపంలనైనా ఆహారంలో తీసుకోవచ్చు. మిల్క్ షేక్స్,కేక్స్ ,సలాడ్ బౌల్స్ వంటి రూపంలో వీటిని ఆహారంలో తీసుకోవచ్చు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ ప్రచురించిన అధ్యయనం ప్రకారం వాల్ నట్స్ లోూ ఒమేగా3 కొవ్వు యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. శరీరంలోని మంటను తగ్గించడంలో సహాయపడతాయి. వాల్ నట్స్ అనేక గుండె సంబంధిత వ్యాధులను తగ్గించడంలోనూ ఎంతగానో ఉపయోగపడతాయి.

బ్లూబెర్రీస్…
వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటితో ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. కణజాల అభివృద్ధికి తోడ్పడుతుందని..అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ తెలిపింది. 150 గ్రాముల బ్లూబెర్రీలు గుండె సంబంధిత వ్యాధులను 15శాతం తగ్గిస్తాయట. ఆహారంలో మార్పులతోపాటు జీవనశైలిలో కూడా కొన్ని మార్పులు చేసుకుంటే గుండెను రక్షించుకోవచ్చు.

యాపిల్స్ …
అమెరికన్ జర్నల్ ప్రకారం యాపిల్ క్రమం తప్పకుండా తిన్నట్లయితే…మహిళ్లల్లో 13 నుంచి 22 శాతం కరోనరీ వ్యాధులు తగ్గుతాయి.

సిట్రస్ ఫ్రూట్స్….
విటమిన్ సీ నారింజ, నిమ్మ, ద్రాక్షపండు వంటి పండ్ల ద్వారా ఇమ్యూనిటీని పెంచడంలో సహాయపడతాయి. విటమిన్ సీ పుష్కలంగా ఉన్న పండ్లలో గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ ను అదుపులో ఉంచుతాయి.

పీనట్స్ …
వేరుశనగలు మోనోశాచురేటెడ్ కొవ్వులతో కూడి ఉంటుంది. ఈ కొవ్వు గుండెకు చాలా అవసరం. గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలోపాటు బ్యాడ్ కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ ను తగ్గించడంలో సహాయపడతాయి. వీటన్నింటితోపాటు మన శరీరం తయారు చేయలేని కీలక ఫ్యాట్లను తయారు చేస్తుంది.