Site icon HashtagU Telugu

I Am With CBN : ద‌ద్ద‌రిల్లిన బెజ‌వాడ బెంజ్ స‌ర్కిల్.. చంద్ర‌బాబుకు మ‌ద్ధ‌తుగా మ‌హిళ‌ల ఆందోళ‌న‌

TDP

TDP

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అరెస్ట్‌కు వ్య‌తిరేకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. తెలంగాణ‌లో ఐటీ ఉద్యోగులు ఆందోళ‌న బాట ప‌ట్ట‌గా.. విజ‌య‌వాడలో మ‌హిళ‌లు పెద్ద సంఖ్య‌లో రోడ్డెక్కారు. ఐ యామ్ విత్ బాబు అంటూ బెజ‌వాడ బెంజ్ స‌ర్కిల్ హోరెత్తింది. సీఎం జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా మ‌హిళ‌లు నినాదాలు చేశారు. స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసులో చంద్ర‌బాబుని అక్ర‌మంగా అరెస్ట్ చేశారంటూ మ‌హిళ‌లు మండిప‌డ్డారు. మ‌హిళ‌ల ఆందోళ‌న‌తో బెంజ్ స‌ర్కిల్ వ‌ద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆందోళ‌న నేప‌థ్యంలో పోలీసులు భారీగా మోహ‌రించారు. ఆందోళ‌న చేస్తున్న‌మ‌హిళ‌ల‌ను పోలీసులు అరెస్ట్ చేసి స్టేష‌న్‌కి త‌ర‌లించారు.