Tomato Prices: భారీగా తగ్గిన టమాటా ధరలు, ఆనందంలో మహిళలు

టమాటా సరఫరా పెరగడంతోపాటు ధరలు తగ్గుముఖం పట్టడంతో గృహిణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

  • Written By:
  • Updated On - August 21, 2023 / 04:48 PM IST

Tomato Prices: దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో టమోటా పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. పొరుగు రాష్ట్రాల నుంచి టమాట రాక గణనీయంగా తగ్గింది. దీంతో ధర్మపురి, కృష్ణగిరి జిల్లాల్లో కిలో రూ.130 నుంచి రూ.160కి పెరగ్గా, చెన్నైతోపాటు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో టమాట ధర రూ.200కి పెరిగింది. ఈ క్రమంలో ఆగస్టు నెల నుంచి టమాటా సరఫరా పెరగడంతో క్రమేణా ధర తగ్గి కిలో 40 రూపాయల నుంచి 50 రూపాయల వరకు విక్రయించారు.

అలాగే ధర్మపురి జిల్లాలోని పాలకోడు, మారండ అల్లి, బెల్రంపట్టి, కారకూర్, తిరుమలవాడి, ఉసిలంపాటి ప్రాంతాల్లోనూ టమాటా సరఫరా పెరగడంతో టమాటా ధర తగ్గింది. ఈరోజు ధర్మపురి రైతుబజారులో కిలో టమాటా రూ.23 నుంచి రూ.25 వరకు విక్రయించారు. టమాటా సరఫరా పెరగడంతోపాటు ధరలు తగ్గుముఖం పట్టడంతో గృహిణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: MLC Kavitha: దమ్మున్న ముఖ్యమంత్రి, ధైర్యంగల్ల ప్రకటన: ఎమ్మెల్సీ కవిత