Site icon HashtagU Telugu

Ajmer Dargah: అజ్మీర్ దర్గాలో డాన్స్ చేసిన మహిళ.. వీడియో వైరల్?

Ajmer Dargah

Ajmer Dargah

సోషల్ మీడియా డెవలప్ అవ్వడంతో చాలామంది రీల్స్ చేసేవారు లైక్స్ కామెంట్స్ కోసం రకరకాల వీడియోలు చేయడం చుట్టూ ఎవరు ఉన్నారు? ఎక్కడ ఉన్నాము అన్న సంగతి పట్టించుకోకుండా పిచ్చిపిచ్చిగా డాన్సులు చేయడం లాంటివి చేస్తున్నారు. బయట పబ్లిక్ లో టెంపుల్స్ లో దర్గాలలో ఇలా ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తున్నారు. అనవసరంగా లేనిపోని వివాదాలను తెచ్చుకుంటున్నారు. తాజాగా అటువంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ వీడియోలో ఒక మహిళ దర్గా ఆవరణ ప్రాంతంలో డాన్స్ చేసింది. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ మండిపడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. గ్రేట్, పింక్ కలర్ కుర్తా దుపటా ధరించిన ఒక మహిళ ఇయర్ ఫోన్స్ లో మ్యూజిక్ ను ఆస్వాదిస్తూ డాన్స్ చేసింది. అది కూడా దర్గాలో. ప్రార్థన స్థలం అన్న విషయాన్ని కూడా మర్చిపోయి పాటలకు అనుగుణంగా డాన్స్ చేసింది. ఈ ఘటన రాజస్థాన్ లోని తారాఘడ్ హిల్ పాదాల చెంత కొలువైన ప్రముఖ అజ్మీర్ దర్గాలో చోటు చేసుకుంది. 13వ శతాబ్దపు సూపి బోధకుడు ఖ్వాజా మెయినుద్ధిన్ చిస్తీ దర్గాకు వచ్చిన సహచర సందర్శకుడు ఈ క్లిప్ ను రికార్డు చేసినట్టు సమాచారం.

వీడియో వరల్డ్ అవడంతో సదరు మహిళపై దర్గా నిర్వాహకులు మండిపడుతున్నారు. దేశంలో ప్రముఖ పవిత్ర స్థలాలలో అజ్మీర్ దర్గా కూడా ఒకటని. దేశవ్యాప్తంగా అన్ని మతాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో సందర్శిస్తూ ఉంటారని అటువంటి ప్రదేశంలో ఆ మహిళ అలా చేయడం తప్పు అని నెటిజన్స్ మండిపడుతున్నారు. సదరు మహిళా వెంటనే వీడియోని డిలీట్ చేసి దర్గా అధికారులను క్షమాపణ కోరాలి అని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు.