Site icon HashtagU Telugu

Gandhi Bhavan : గాంధీ భవన్ లో మహిళా కాంగ్రెస్ నేతల ధర్నా

Women Congress Leaders' Pro

Women Congress Leaders' Pro

హైదరాబాద్‌లోని గాంధీ భవన్ (Gandhi Bhavan) వద్ద మహిళా కాంగ్రెస్‌ నేతలు ఆందోళనకు దిగారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు (Sunitharao)కు వ్యతిరేకంగా గోషామహల్ నియోజకవర్గానికి చెందిన మహిళా నేతలు ఆందోళన చేపట్టారు. “సునీతా హటావో – గోషామహల్ బచావో” అంటూ నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. తమను పార్టీ అభివృద్ధిలో భాగం చేసుకోకుండా సునీతారావు అడ్డుపడుతున్నారని వారు ఆరోపించారు.

AP Spurios Liquor Probe: జంగారెడ్డిగూడెం కల్తీ సారా మరణాలపై టాస్క్‌ఫోర్స్‌!

ఆందోళనలో పాల్గొన్న మహిళా నేతలు సునీత తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ లోని పదవులను నిస్వార్థంగా పనిచేసే వారికి ఇవ్వకుండా, డబ్బు తీసుకుని అమ్ముకుంటున్నారని ఆరోపించారు. తమను పదవుల నుంచి బహిష్కరించే కుట్రలో సునీతారావు పాలుపంచుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. నిజాయితీగా పనిచేస్తున్న కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తూ, స్వార్థపరులకే ప్రాధాన్యత ఇవ్వడం దుర్మార్గమని నేతలు అభిప్రాయపడ్డారు. వెంటనే కాంగ్రెస్ హైకమాండ్‌ సునీతారావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమెను అధ్యక్ష పదవి నుంచి తొలగించాల్సిందిగా కోరారు. పార్టీ పునర్నిర్మాణానికి, నిజమైన కార్యకర్తలకు న్యాయం చేయాలంటే ఈ నిర్ణయం తప్పదని స్పష్టంగా పేర్కొన్నారు. గోషామహల్ నియోజకవర్గ మహిళా శ్రేణులు తమ న్యాయం కోసం పోరాడుతామని తేల్చిచెప్పారు.