మనిషి సాంకేతిక పరిజ్ణానంతో ఎన్నో అద్బుతాలు స్రుష్టిస్తున్నాడు. ఆకాశాన్ని అందుకుంటున్నాడు..సముద్రం లోతులను తెలుసుకుంటున్నాడు. అయినా మూఢనమ్మకాల నుంచి బయటపడటం లేదు. ముఖ్యంగా ఆడపిల్లల గురించి సమాజంలో చిన్నచూపు ఇంకా కొనసాగుతునే ఉంది. ప్రభుత్వాలు, అధికారులు, సామాజిక కార్యకర్తలు ఇలా ప్రజల్లో ఆడపిల్లల పట్ల ఉన్న అసమానతలను తొలగించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా…ఎక్కడో ఒక చోట ఆడపిల్ల అన్యాయానికి గురవుతూనే ఉంది. ఆడపిల్ల పుట్టిందని కోడలు అత్తారింట్లో పెట్టే కష్టాలు ఎన్నో వింటూనే ఉన్నాం. తాజాగా అలాంటి ఘటనే జరిగింది. ఆడపిల్లలకు జన్మనించినదని ఓ మహిళపై భర్త, బంధువులు దాడి చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.
యూపీలోని మహోబా జిల్లాలోని రాంనగర్ జుఖా ప్రాంతానికి చెందిన ఓ మహిళ…ఆమె బంధువులు భర్త దారుణంగా కొట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో పోలీసుల ద్రుష్టికి వెళ్లింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. అత్తింటివారి దాడిలో గాయాలపాలైన మహిళను ఆసుపత్రిలో చేర్పించారు. తనకు రెండోసారి కూడా కొడుకు పుట్టలేదని భర్తలు, అత్త బంధువులు తనపై దాడి చేశారని బాధితురాలు చెప్పింది. రోడ్డుపై పడేసి కాళ్లతో తన్నారు. ఆపమని ఎంత మొత్తుకున్నా కనికరించలేరు. ఇరుగుపొరుగువారు చూసారు తప్పా ఎవరూ ఆపలేదు. మహిళా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.