Site icon HashtagU Telugu

London: విమానంలో నిద్రలోనే మరణించిన వృద్ధురాలు

London

London

London: మరణం ఎప్పుడు ఎలా వస్తుందో అంచనా వేయడం అసాధ్యం. అలాగే మరణం నుంచి తప్పించుకోలేము. అయితే అకాల మరణం నిద్రలోనే వస్తుందంటారు. తాజాగా విమానంలో ప్రయాణిస్తున్న 73 ఏళ్ళ వృద్ధురాలు నిద్రలోనే శ్వాస విడిచింది.

లండన్ లో బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో విషాదం చోటు చేసుకుంది. లండన్ నుంచి నైస్ వెళ్లే ఈ విమానంలో 73 ఏళ్ల వృద్ధురాలు ప్రయాణిస్తుంది. అయితే ఏమైందో ఏమో కానీ ఆమె నిద్రలోనే మృతి చెందింది. వృద్ధురాలిని నిద్ర లేపగా, ఆమె ఎంతసేపటికీ నిద్ర లేవకపోవడంతో ఆందోళన చెందిన ప్రయాణికులు సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది పారామెడిక్స్‌కు సమాచారం అందించారు. వాళ్ళు వచ్చి పరీక్షలు చేసి చూడగా ఆమె నిద్రలోనే మృతి చెందినట్లు నిర్దారించారు. రాత్రి 10 గంటలకు మహిళ చనిపోయినట్లు ప్రకటించారు. గుండెపోటుతో మరణించినట్లు అనుమానిస్తున్నారు. వృద్ధురాలి మరణాన్ని ధృవీకరిస్తూ, బ్రిటిష్ ఎయిర్‌వేస్ తెలిపింది.

Also Read: AP : రాబోయే ఎన్నికల్లో జగన్ ఓటుకు రూ.20 వేలు ఇస్తాడు – రఘురామ