Warangal: బర్లు ను దొంగతనం చేస్తున్న మహిళను గ్రామస్తులు పట్టుకొని స్తంభానికి కట్టేసి కొట్టేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పరిధిలోని సర్వపురం 5వ వార్డులో వేముని స్వామికి చెందిన నాలుగు బర్ల ఇంటి ముందు కట్టేశారు. అయితే నర్సంపేట పట్టణానికి చెందిన నలుగురు వ్యక్తులు అర్ధరాత్రి వాటిని తరలిస్తుండగా శబ్దం రావడంతో చుట్టుపక్కల వాళ్ళు చూసి బర్లను ఎవరో కొట్టుకెళుతున్నారని కేకలు వేశారు.
ఇంటి యజమాని బంధువులు లేచి వారిని వెంబడించగా తప్పించుకుపోయారు. అయితే మహిళ మేరీ ని అదుపు తీసుకొని స్తంభం కట్టేశారు. కొత్తగూడ ఖానాపురం చుట్టుపక్క ప్రాంతాల నుండి బర్లను తీసుకొచ్చి కోసి అమ్ముతున్నట్లు ఆమె తెలిపింది. ఈ విషయం చుట్టుపక్కల గ్రామస్తులకు తెలియడంతో అప్రమత్తమయ్యారు.