Site icon HashtagU Telugu

Women Robbery: పెళ్లి వేడుకలో 20 లక్షల నగదు మాయం.. తీరా చూస్తే మహిళ చేసిన పనికి షాక్?

Women Robbery

Women Robbery

రోజురోజుకీ దేశవ్యాప్తంగా దొంగతనాలకు కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దొంగతనాల కోసం దొంగలు వినూత్న ప్రయత్నాలు చేస్తూ కొత్త కొత్త విధానాలను అమలు పరుస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. పెళ్లి, చావు అని తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ దొంగతనాలు చేస్తున్నారు. తాజాగా కూడా ఒక పెళ్లిలో ఒక మహిళ ఏకంగా 20 లక్షల విలువైన నగలు దొంగతనం చేసి పారిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన ఖార్జండ్, రాంచీలోని మోరబాడి ఏరియాలో చోటుచేసుకుంది. ఒక పెళ్లి వేడుకకు అతిథిగా ఒక మహిళ హాజరయ్యింది.

అయితే అందరూ పెళ్లి సంబరాలు మునిగిపోయి ఉండడంతో అదే విధంగా భావించిన ఒక మహిళ ఉండగా ఆమె మాత్రం చోరీకి ప్లాన్ అమలు చేసింది. అందరూ బిజీగా ఉండగా ఆమె రూ. 20 లక్షల విలువైన నగలతో ఉడాయించింది. రాంచీలో ఓ కుటుంబం వారి బిడ్డ పెళ్లిని గ్రాండ్ గా నిర్వహించారు. ఆ పెళ్లికి ఓ మహిళ అతిథిగా వెళ్లింది. అప్పుడే పెళ్లి కొడుకును ఊరేగింపుగా తీసుకువచ్చారు. దీంతో కాబోయే అల్లుడు పెళ్లి మంటపానికి రావడంతో కుటుంబం అంతా బిజీ అయింది. ఇదే అదునుగా చూసిన ఆ మహిళ అక్కడ నగల పై కన్నేసింది. దుపట్టా కింద దాచుకుని బయట పడింది.

ఊరేగింపు, పెళ్లి తంతు తర్వాత బంధువుల మళ్లీ తమ గదుల్లోకి వచ్చిన తర్వాత నగలను మరోసారి చూసుకున్నారు. కానీ, రూ. 20 లక్షల విలువైన నగలు, మరికొంత నగదు కనిపించకుండా పోయింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు వెంటనే సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. పెళ్లి వేడుక జరుగుతుండగానే ఓ మహిళ దుపట్టా కింద నగలను దాచి బయటకు వెళ్లుతూ కనిపించింది. ఈ సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులకు ఆ పెళ్లి వారి ఫిర్యాదు చేయడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సిసిటీవీ ఆధారంగా ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను తొందరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు. ఇదేకాకుండా గతంలో కూడా ఇటువంటి ఘటనలు జరిగాయి అని పోలీసులు వెల్లడించారు. ఆ ఘటనలు కూడా అచ్చం ఇలాగే పెళ్లిలో జరిగినట్లు వాళ్ళు తెలిపారు.

Exit mobile version