Viral News: తల్లికి చనిపోయిన బిడ్డను ఇఛిన‌ వైద్యులు.. చనిపోలేదని పోరాడటంతో మూడేళ్లకు?

  • Written By:
  • Publish Date - June 13, 2022 / 07:00 PM IST

కొన్నిసార్లు కొందరి నిర్లక్ష్యం కారణంగా ఎన్నో కోల్పోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ బిడ్డ తన తల్లి హక్కున చేరడం కోసం సుమారు మూడు సంవత్సరాల పాటు సమయం పట్టింది. అస్సాంలో జరిగిన ఈ ఘటన పాతది అయినప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2019 లో అస్సాం లోని బార్‌పేట్‌ జిల్లాలో నజ్మా ఖనమ్ అనే మహిళ ప్రభుత్వాస్పత్రిలో ఎంతో ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చారు. అయితే బిడ్డను పిల్లల సంరక్షణ గదిలో ఉంచిన అనంతరం వైద్య సిబ్బంది తమ బిడ్డ చనిపోయిందని, చనిపోయిన బిడ్డను తీసుకువచ్చి నజ్మా చేతిలో పెట్టారు.

ఈ విధంగా చనిపోయిన బిడ్డను తీసుకువచ్చి తనకు ఇవ్వడంతో ఆమె ఆ బిడ్డ తన బిడ్డ కాదు అంటూ పోరాటం చేసింది. ఎంతో ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వగా ఇలా చనిపోయిన బిడ్డను చేతిలో పెట్టేసరికి నజ్మా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసి కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసు విచారణ చేసి ఆ బిడ్డను డీఎన్ఏ పరీక్షలకు పంపించారు. ఈ విధంగా ఈ విచారణ ముగిసి ఆ బిడ్డ తల్లి చెంతన చేరడం కోసం మూడు సంవత్సరాల సమయం పట్టింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు మూడు రోజుల క్రితం ఆస్పత్రిలో ఎవరెవరు ప్రసవించారు అనే విషయాల గురించి ఆరా తీశారు. ఈ క్రమంలోనే అదే రోజు అదే ఆస్పత్రిలో నజ్మా అనే పేరుతో మరో మహిళ కూడా ప్రసవించిందని, తన బిడ్డ చనిపోతే వైద్యులు నిర్లక్ష్యం కారణంగా బిడ్డలను తారుమారు చేశారని విచారణలో తేలింది. 2020 అక్టోబర్‌లో బిడ్డకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ వచ్చింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు బిడ్డకు నజ్మా ఖనమ్‌కు అప్పగించారు. ఈ విధంగా తన బిడ్డ కోసం మూడు సంవత్సరాల పాటు న్యాయపోరాటం చేసిన తల్లి చివరకు తన బిడ్డను తన సొంతం చేసుకుంది. కేవలం వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆ బిడ్డ మూడు సంవత్సరాల పాటు తల్లికి దూరంగా ఉంది.