Site icon HashtagU Telugu

Karnataka: నిశ్చితార్థం జరిగిన కొద్ది రోజులకే మహిళపై అత్యాచారం

Karnataka

New Web Story Copy 2023 09 11t135155.416

Karnataka: కర్ణాటకలో దారుణం జరిగింది. పెళ్లి పీటలెక్కాల్సిన ఓ యువతీ కామాంధుల చేతిలో బలైంది. కొద్దీ రోజుల్లో వివాహం చేసుకు భర్తతో సుఖంగా జీవించాల్సిన యువతి దారుణ అత్యాచారానికి గురైంది. ఇటీవలే ఆమెకు ఘనంగా నిశ్చితార్థం జరిగింది. ఇది జరిగిన కొద్ది రోజులకే ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన సంచలనం రేపింది.

కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాముద్నాల్ జిల్లా ముద్నాల్ తండాకు చెందిన సవిత రాథోడ్ (35) అనే మహిళకు కొద్దీ రోజుల క్రితం నిశ్చితార్థం జరిగింది. త్వరలో వివాహం జరగాల్సి ఉంది. పోలీసులు సచిన్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నప్పటికీ, ఇది సామూహిక అత్యాచారం కేసుగా వారు భావిస్తున్నారు. ఈ ఘటన సెప్టెంబర్ 9న కంచగరహళ్లి క్రాస్‌లోని మహిళ తమ పొలానికి వెళ్లిన సమయంలో జరిగింది. యువతి ఛాతీపై, చెవిపై కత్తిపోట్లు ఉండడంతో గ్రామస్తులు గుర్తించి వెంటనే కలబురగిలోని ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె సోమవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సవిత అనాథ అని, తన సోదరుడితో కలిసి జీవిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది.

Also Read: Chandrababu: 14 ఏళ్ళ ముఖ్యమంత్రికి 14 రోజుల రిమాండ్.. దేవుడి స్క్రిప్ట్..!