Site icon HashtagU Telugu

Cockroach: బొద్దింక దెబ్బకు ఉద్యోగం, ఇల్లు వదిలి పరారైన మహిళ?

Cockroach

Cockroach

ఏంటి.. బొద్దింక దెబ్బకు మహిళ భయపడడమేంటి, ఇల్లు ఉద్యోగం మొదలు పారిపోవడం ఏంటి అనుకుంటున్నారా. అవును మీరు విన్నది నిజమే. ఒక మహిళ మంచి ఉద్యోగం చేతినిండా డబ్బులతో ఎంతో ఆనందంతో తన జీవితాన్ని గడుపుతోంది. ఇంతలో ఒక బొద్దింక ఆమె జీవితాన్నే తలకిందులు చేసింది. బొద్దింక దాటికి తీవ్ర మనస్తాపానికి గురైన ఆ మహిళ ఇంటి నుంచి వెళ్లడమే కాకుండా ఉద్యోగానికి కూడా రాజీనామా చేసింది. ఇంతకీ ఆ మహిళ ఎవరు? అసలేం జరిగింది అన్న వివరాల్లోకి వెళితే.. ఈ వింత ఘటన చైనాలో చోటు చేసుకుంది.

మంగోలియన్ మహిళ గ్వాంగ్‌జౌలోని అదే కంపెనీలో మూడేళ్లుగా పనిచేస్తోంది. దీని తరువాత ఎక్కువ జీతం కోరికతో మహిళ కంపెనీని మార్చింది. చైనాలోని దక్షిణ భాగానికి మారింది. అయితే అక్కడ చేదు అనుభవాలు చవిచూడాల్సి వచ్చింది. ఎక్కువ జీతం ఆశించి వెళ్లిన ఆమె చివరికి ఇల్లు, ఉద్యోగం రెండూ కోల్పోవాల్సి వచ్చింది. గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్ రాజధానికి మారడానికి ముందు తాను బొద్దింకలను చూడలేదని ఆ మహిళ చైనీస్ నెట్‌వర్కింగ్ సైట్ జియాహోంగ్షులో వీడియో పోస్ట్ చేసింది. అక్కడ ఆ మహిళ ఎగిరే పెద్ద బొద్దింకలను చూసింది. ఆ మహిళ బొద్దింకల చిత్రాన్ని షేర్ చేస్తూ, బొద్దింకలు తనను ఎలా హింసించాయో తెలిపింది.

అంతేకాకుండా తాను ఆ బొద్దింకలకు ఎంతగానో భయపడినట్లు ఆమె తెలిపింది. అలాగే ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లడమే కాకుండా ఇప్పుడు ఆ ప్రాంతంలో పని చేయడానికి కూడా వెనకడుగు వేస్తోంది. ఇంటిలోపల పగుళ్లను పూడ్చినా ప్రయోజనం లేదని ఆ మహిళ చెబుతోంది. ఇప్పుడు ఈ మహిళ కూడా బొద్దింక అనే పదానికి భయపడుతోంది. నిజం చెప్పాలంటే ఆమె ప్రస్తుతం బొద్దింక ఎమోజీని చూసి కూడా భయపడుతుంది. ఆమెకు బొద్దింక ఫోబియా వచ్చింది. తనకు చాలా నిస్సహాయంగా అనిపించిందని ఆ మహిళ తెలిపింది. వాటిని ఎదుర్కొలేక ఒంటరిగా ఏడవడం ప్రారంభించింది. ఆ మహిళను ఎగిరే బొద్దింకలు ఎంతగా చిత్రహింసలకు గురి చేశాయంటే అలసిపోయి ఉద్యోగానికి రాజీనామా చేసింది అని తెలియడంతో నేటిజన్స్ నవ్వుకుంటున్నారు.