Site icon HashtagU Telugu

Woman Passenger : ఫ్లైట్‌లో సిగిరేట్ తాగుతూ పట్టుబ‌డిన మ‌హిళా ప్ర‌యాణికురాలు

smoking

smoking

కోల్‌కతా-బెంగళూరు విమానంలోని లావేటరీలో సిగిరేట్ తాగుతూ ఓ మ‌హిళ ప‌ట్టుబ‌డింది. 24 ఏళ్ల మహిళ ప్రయాణికురాలిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. మార్చి 5న ఇండిగో విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాత్‌రూం నుండి పొగ వాసన రావడంతో అప్రమత్తమైన క్యాబిన్ సిబ్బంది బలవంతంగా తలుపులు తెరిచి చూడగా అక్కడ మహిళ సిగిరేట్ తాగుతున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత ఆమె సిగరెట్‌ను డస్ట్ బిన్‌లో విసిరింది, ఆ తర్వాత క్యాబిన్ సిబ్బంది దానిపై నీరు పోశారు. ఈ విషయాన్ని క్యాబిన్ సిబ్బంది కెప్టెన్ దృష్టికి తీసుకెళ్లారు. బెంగళూరు విమానాశ్రయంలో దిగగానే సదరు ప్రయాణికురాలిని ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించారు. ఆమెపై ఫిర్యాదు చేశారు. ఆమెను ఎయిర్‌పోర్ట్ పోలీసులు అరెస్టు చేశారు మరియు IPC సెక్షన్ 336 కింద కేసు న‌మోదు చేశారు.

Exit mobile version