Site icon HashtagU Telugu

Woman Kills Mother : తల్లిని చంపి..సూట్ కేస్ లోకి కుక్కి.. పోలీసులకు లొంగిపోయింది

Woman Kills Mother

Woman Kills Mother

Woman Kills Mother : బెంగళూరులో అమానుషం జరిగింది.  39 ఏళ్ల మహిళా ఫిజియోథెరపిస్ట్.. 70 ఏళ్ళ తన తల్లిని దారుణంగా హత్య చేసింది. ఆమె మర్డర్ చేశాక తన తల్లి మృతదేహాన్ని సూట్‌కేస్‌లోకి కుక్కి.. నగరంలోని మైకో లేఅవుట్ ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్‌ కు వెళ్లి ఆ సూట్ కేస్ ను అప్పగించి  సరెండర్ అయింది. తల్లితో నిత్యం గొడవలు జరుగుతుండటం వల్లే హత్య చేశానని మహిళ అంగీకరించిందని పోలీసులు వెల్లడించారు. ఈ హత్య చేసిన మహిళ పేరు  సేనాలి సేన్ అని.. ఆమె పశ్చిమ బెంగాల్‌ వాస్తవ్యురాలని గుర్తించారు. బెంగళూరులోని బిలేకహళ్లి ప్రాంతంలో ఉన్న ఓ ఫ్లాట్‌లో తన భర్త,  తల్లి బీవా పాల్‌ తో కలిసి సేనాలి సేన్ నివసించేదని దర్యాప్తులో తేలింది. ఈ మర్డర్ చేసిన  సమయంలో సేనాలి సేన్ భర్త ఇంట్లో లేడని పోలీసులు తెలిపారు. అయితే హత్య జరిగినప్పుడు సేనాలి సేన్ అత్తగారు ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లో ఒక గది లోపల ఈ మర్డర్ జరగడం వల్ల తాను గుర్తించలేకపోయానని సేనాలి సేన్ అత్తగారు పోలీసులకు చెప్పింది.

సెనాలీ సేన్ పై పోలీసులు IPC సెక్షన్ 302, ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సేనాలీకి తన తల్లితో తరచూ గొడవలు జరిగేవని ప్రాథమిక విచారణలో తేలింది. ఈసారి గొడవ జరుగుతున్న సమయంలో ఆమె తల్లి నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో..  ఆగ్రహానికి గురైన సేనాలీ తన తల్లికి 20 నిద్రమాత్రలు తినిపించిందని పోలీసులు చెప్పారు. కొంతసేపటికి కడుపునొప్పితో తల్లి కేకలు వేయడంతో ఆగ్రహించిన సేనాలీ కిరాతకంగా తల్లి గొంతు కోసి హత్య(Woman Kills Mother) చేసింది. పోలీసులు ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు.