Hyderabad: పీడీఎస్ గోధుమల అక్రమ రవాణా చేస్తున్న ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఓ మహిళ రేషన్ షాపుల నుంచి అక్రమంగా గోధుమలను కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాల వ్యాపారులకు అక్రమంగా విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న సిటిఎఫ్ బృందం ఇన్‌స్పెక్టర్ రమేష్ నాయక్ నిందితురాలిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. పేదలకు అందాల్సిన ధాన్యంతో వ్యాపారం చేస్తున్న ఆమె ఇంట్లో దాదాపుగా 2.5 టన్నుల పీడీఎస్ గోధుమలను స్వాధీనం చేసుకున్నారు. కమిషనర్ టాస్క్ ఫోర్స్ (సీటీఎఫ్) శనివారం హఫీజ్ బాబానగర్‌లోని ఆమె ఇంటిపై దాడి చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
Read More: Kidnap : శంషాబాద్ లో ఇంజనీర్ కిడ్నాప్ కలకలం.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన