Ivf Clinic Cheat : ఒక ఐవీఎఫ్ క్లినిక్ చీటింగ్ కు పాల్పడింది..
సంతాన భాగ్యం కోసం తమ దగ్గరికి వచ్చిన దంపతులను మోసం చేసింది.
ఓ మహిళ గర్భం దాల్చేందుకు ..ఆమె భర్తకు బదులుగా మరో పురుషుడి స్పెర్మ్‌ను ఉపయోగించింది.
ఢిల్లీకి చెందిన ఒక ఆ IVF క్లినిక్ అనైతికంగా ప్రవర్తించింది. ఓ మహిళకు ఆమె భర్తకు బదులుగా వేరే వ్యక్తి స్పెర్మ్ ను ఇచ్చింది. ఇందుకుగానూ ఆ క్లినిక్ కు జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (NCDRC) రూ.1.5 కోట్ల జరిమానా విధించింది. ఇలాంటి క్లినిక్‌ల అక్రెడిటేషన్‌ను తనిఖీ చేయడంతో పాటు నవజాత శిశువుల DNA ప్రొఫైల్‌లను జారీ చేయడాన్ని ఇకపై తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉందని NCDRC వ్యాఖ్యానించింది.
Also read : BRO Looks: లుంగీ గెటప్ లో పవన్, సాయిధరమ్ తేజ్, వింటేజ్ లుక్స్ అదుర్స్
2009లో అలా మొదలైంది..
IVF క్లినిక్ చీటింగ్ వల్ల వేరే వ్యక్తి స్పెర్మ్ పొందిన మహిళ 2009 జూన్ లో ఏఆర్‌టీ విధానంలో కవలలకు జన్మనిచ్చింది. శిశువుల బ్లడ్ గ్రూప్ లను టెస్ట్ చేయగా.. అవి డిఫరెంట్ గా ఉన్నట్టు తేలింది . దీంతో అనుమానం వచ్చి ఆ పిల్లలకు డీఎన్ఏ ప్రొఫైలింగ్ టెస్ట్ (DNA profiling test) చేశారు. ఈ టెస్టులో పిల్లల్లో ఉన్న డీఎన్ఏ కు.. పిల్లలకు జన్మనిచ్చిన మహిళ భర్త డీఎన్ఏకు సరిపోలలేదు. అవి రెండూ డిఫరెంట్ గా ఉన్నాయని తేలింది. ఆ పిల్లల తండ్రి అతడు కాదని వెల్లడైంది. ఈ లెక్కన IVF క్లినిక్ మరో వ్యక్తి స్పెర్మ్ ను ట్రీట్మెంట్ లో వాడిందని తేటతెల్లమైంది.
కట్ చేస్తే.. 14 ఏళ్ళు గడిచాయి
దీంతో ఆ దంపతులు 2009లోనే జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ను ఆశ్రయించారు. ఈవిధంగా చీటింగ్ ట్రీట్మెంట్ చేయడం వల్ల మానసిక ఒత్తిడికి గురయ్యాడని .. కుటుంబ విభేదాలు వచ్చాయని.. జన్యుపరంగా సంక్రమించే వ్యాధుల భయం పట్టుకుందని మహిళ భర్త చేసిన వాదనతో NCDRC ఏకీభవించింది. ఇందుకు IVF క్లినిక్ యజమానులతో పాటు దాని డైరెక్టర్, చైర్మన్, ముగ్గురు వైద్యులు బాధ్యత వహించాలని(Ivf Clinic Cheat) స్పష్టం చేసింది. రూ.1.5 కోట్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. కట్ చేస్తే .. ప్రస్తుతం ఆ ఇద్దరు కవల బాలికల వయసు 14 సంవత్సరాలు.