Site icon HashtagU Telugu

Gym Issue: జిమ్లో వర్కౌట్ చేస్తూ తలకిందులుగా ఇరుక్కుపోయిన మహిళ.. వీడియో వైరల్?

Us Woman

Us Woman

ప్రతిరోజు చాలామంది జిమ్ కి వెళ్లి కసరతులు చేస్తూ ఉంటారు. అయితే జిమ్ చేసేటప్పుడు అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు కూడా సూచిస్తూ ఉంటారు. లేదంటే అక్కడే ఉన్న జిమ్ ట్రైనర్ల సలహాలు తీసుకోమని పాటించమని చెబుతూ ఉంటారు. అలాకాకుండా జిమ్ లో ఎలా పడితే అలా చేస్తే ప్రాణాలకు సైతం ప్రమాదం కలగవచ్చు. వర్కౌట్ చేస్తున్న సమయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. హెవీ వర్క్ ఔట్స్ చేస్తున్న సమయంలో వాటిపట్ల సరైన అవగాహన లేకపోయినప్పుడు కండరాలు పట్టుకుపోవడం లేదంటే బ్యాలెన్స్ తప్పిపోవడం లాంటిది కూడా జరుగుతూ ఉంటాయి..

తాజాగా అలాంటి ఘటనే ఒకటి అమెరికాలో చోటుచేసుకుంది. ఓహియాకు చెందిన క్రిస్టిన్‌ ఫాల్డ్స్‌ అనే మహిళ తెల్లవారు జామున 3గంటలకు ఒంటరిగా ఇంట్లోని జిమ్‌లో ఇన్వర్షన్ టేబుల్‌ అనే ఎక్విప్‌మెంట్‌పై వర్కౌట్స్‌ చేస్తోంది. వెన్నెముక, నడుమునొప్పి తగ్గేందుకు దానిని ఉపయోగించి వర్కౌట్స్ చేస్తోంది. ఆ మహిళ వర్క్ ఔట్స్ చేస్తుండగా ఉన్నట్టుండి మహిళ ఇన్వర్షన్ టేబుల్‌పై తలకిందులైంది. కాళ్లు అందులో ఇరుక్కుపోవడంతో ఎంత ప్రయత్నించినా తిరిగి మామూలు స్థితికి రాలేదు. సహాయం కోసం గట్టిగా అరిచినప్పటికీ అక్కడ భారీగా సౌండ్ మ్యూజిక్ ప్లే అవుతుండడంతో ఆమె అరుపులు ఎవరికి వినిపించలేదు.

 

ఆమె పైకి లేలేక బయటకు రాలేక చాలాసేపు నాన్న అవస్థలు పడింది. ఆ తర్వాత తన చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ ఉపయోగించి ఎమర్జెన్సీ నెంబర్ కాల్ చేసి తన పరిస్థితిని వివరించి సహాయం కోరింది. వెంటనే స్పందించిన పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను రచించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ మహిళ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. కానీ కొన్ని కొన్ని సార్లు ఇలాంటి ఘటనలు ప్రాణాలను సైతం తీయవచ్చు.