3D ear: ప్రపంచంలోనే తొలిసారిగా… 3Dచెవి..యువతికి విజయవంతంగా అతికించిన వైద్యులు..!!

బాహ్య చెవులు అభివృద్ధి చెందకపోవడాన్ని మైక్రోటియా అంటారు. ఇది పుట్టుకతోనే వచ్చే వైకల్యం. ఈ వ్యాధితో బాధపడుతున్నవారికి బయటకి చెవులుండవు.

  • Written By:
  • Publish Date - June 6, 2022 / 04:23 PM IST

బాహ్య చెవులు అభివృద్ధి చెందకపోవడాన్ని మైక్రోటియా అంటారు. ఇది పుట్టుకతోనే వచ్చే వైకల్యం. ఈ వ్యాధితో బాధపడుతున్నవారికి బయటకి చెవులుండవు. ఇప్పటివరకు దీనికి శస్త్రచికిత్స అనేది లేదు. ప్రపంచంలోనే తొలిసారి అమెరికా వైద్యులు దీనికి పరిష్కారాన్ని కనుగొన్నారు. మైక్రోటియా వ్యాధితో పుట్టిన 20సంవత్సరాల యువతికి 3D ప్రింటెడ్ టెక్నాలజీతో బాహ్యచెవిని అమర్చారు. ప్రపంచంలోనే ఇది తొలిసారికావడం విశేషం.

మెక్సికోకు చెందిన అలెక్సాకు కుడి వైపు వెలుపలి చెవి చిన్నగా అక్రమాకారంలో ఉంది.దీన్ని పరిశీలించిన 3Dబయో థెరప్యూటిక్స్ నిపుణులు ఆమె మరో చెవి నుంచి కణజాలాన్ని సేకరించారు. అచ్చం కుడివైపు చెవి మాదిరిగానే సహజమైందిగా అనిపించేలా…ఆరినోవో అనే 3D టెక్నాలజీని వాడి మరో చెవికి రూపం కల్పించారు. తొలిసారి క్లినికల్ ట్రయల్స్ లో వైద్యులు రోగి సొంత మృదులాస్థి కణాలను ఉపయోగించి బాహ్య చెవిని పునర్నిర్మించారు. 3Dప్రింటెడ్ టెక్నాలజీతో రోగికి సరిపోయే పరిమాణంలో బాహ్య చెవిని ముద్రించారు. తర్వాత దానిని విజయవంతంగా ఆ యువతికి అమర్చారు. ఇది Ground Breaking reconstactuive Procedure అని 3dబయో ఒక ప్రకటనలో తెలిపింది.

టెక్సాస్లోని శాన్ ఆంటోనియోకు చెందిన మైక్రోషియా కాంజెనిటల్ ఇయర్ డిఫార్మిటీ ఇన్సిట్యూట్ కు చెందిన సర్జన్ డాక్టర్ అర్డురో బొనిల్లా దీనంతటికీ నేతృత్వం వహించారు. సర్జరీ ద్వారా ఆమెకు ఈ చెవిని అతికించారు. నెలరోజుల విశ్రాంతి తర్వాత గురువారం అటెక్సా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యిందని చెప్పారు. రోగుల కార్టిలేజ్ కణాలను ఉపయోగించుకుని చెవిని పునర్నిర్మించేందుకు ఈ సరికొత్త టెక్నాలజీని వినియోగించినట్లు చెప్పారు. దీనివల్ల కొత్త చెవిని శరీరం తిరస్కరించేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు. ఒకటి లేదా రెండు అసంపూర్ణంగా వెలుపలి భాగాలు లేని మైక్రోషియా అనే లోపంతో బాధపడేవారికి ఈ చికిత్స ఉపయోగపడుతుందని తెలిపారు.